కూటమి మ్యానిఫెస్టోను బీజేపీ నేతలు అందుకే ముట్టుకోలేదు.. కారణం చెప్పిన కేశినేని
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఆ తర్వాత టీడీపీని బీజేపీలో కలిపేయడం ఖాయమనీ కేశినేని నాని కామెంట్ చేశారు.
ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టో విడుదలలో ఏం జరిగిందో అందరం టీవీల్లో, యూట్యూబ్ వీడియోల్లో చూశాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌ను కూడా చేయి వేయమంటే ఆయన నో..నో అనేశారు. రిలీజ్ చేశాక చేతికివ్వబోతే కూడా వద్దని అడ్డంగా తలూపేశారు. అదేంటి కూటమిలో భాగస్వామి అయి ఉండి బీజేపీ వాళ్లు మ్యానిఫెస్టోను కూడా ముట్టుకోలేదని కామెంట్లు వచ్చాయి.. దానికి కారణమేంటో చెబుతున్నారు విజయవాడ ఎంపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. బాబుది దొంగ హామీల మ్యానిఫెస్టో అని బీజేపీకి తెలుసని, అందుకే దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని చెప్పారు.
మాయల మ్యానిఫెస్టో అని తెలిసే దూరం పెట్టారు
చంద్రబాబు విడుదల చేసింది మాయల మ్యానిఫెస్టో అని బీజేపీకి తెలుసు.. అందుకే దాన్ని వాళ్లు నమ్మడం లేదని నాని అన్నారు. అయినా బీజేపీ కూడా కూటమిలో ఉన్నప్పుడు వారి నేతల ఫొటో మ్యానిఫెస్టోలో ఎందుకు లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఆ తర్వాత టీడీపీని బీజేపీలో కలిపేయడం ఖాయమనీ కేశినేని నాని కామెంట్ చేశారు. రానున్న ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించి మళ్లీ జగన్ ప్రభుత్వం తెచ్చుకోవాలని జనం ఫిక్సయిపోయారని నాని చెప్పారు. టీడీపీ ఓడిపోవడం, ఆ పార్టీ ఆఫీస్‌కి తాళాలు వేసుకుని చంద్రబాబు హైదరాబాద్ చెక్కేయడం పక్కా అని ఎద్దేవా చేశారు.
టచ్ మీ నాట్ అన్నది అందుకే
కూటమి మ్యానిఫెస్టో అని కలరిస్తున్నా అది అచ్చంగా చంద్రబాబు మ్యానిఫెస్టో అని జనాలందరికీ తెలుసు. షణ్ముఖ వ్యూహం.. అని పవన్ కళ్యాణ్ ఎన్ని కబుర్లు చెప్పినా అక్కడ బాబు మాయ మాటల గారడీతోనే మ్యానిఫెస్టో రెడీ అయిందని ప్రజలందరికీ తెలుసు. కూటమిలో ఉన్న కాకలు తీరిన బీజేపీ నాయకులకు తెలియదా? అందుకే రేపు బాబు పుసుక్కున అధికారంలోకి వచ్చినా అవేమీ చేయడు మనమెందుకు బద్నామ్ కావాలని ముందు జాగ్రత్తగా బీజేపీ వాళ్లు మ్యానిఫెస్టోను చూసి టచ్ మీ నాట్ మొక్కలా ముడుచుకుపోయారు.