కేశినేనికి టికెట్.. థర్డ్ లిస్ట్ లో ఇదే హాట్ టాపిక్
నాని విజయవాడ వైసీపీ టికెట్ వ్యవహారం టీడీపీలో కూడా హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్ ఖాయం అనే నమ్మకం కుదిరిన తర్వాతే ఆయన టీడీపీకి దూరమయ్యారనే చర్చ మొదలైంది.
అలా కండువా కప్పుకున్నారు, ఇలా వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్ పట్టేశారు. అదృష్టం అంటే కేశినేని నానీదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయన, సడన్ గా ఆ పార్టీ టికెట్ ఇవ్వదని తెలిసి వైసీపీలో చేరారు. చేరిన రోజుల వ్యవధిలోనే థర్డ్ లిస్ట్ లో ఆయన పేరు బయటకొచ్చింది. ఎంపీగా ఆయన్ను తిరిగి అదే చోట పోటీ చేయించబోతున్నారు జగన్. నాని అక్కడ గెలవలేరని ఆయన తమ్ముడు చిన్నికి ప్రయారిటీ ఇచ్చింది టీడీపీ. అయితే అదే నాని వైసీపీ టికెట్ పై అక్కడ కచ్చితంగా గెలుస్తారని నమ్ముతోంది వైసీపీ. ఎవరి నమ్మకం నిలబడుతుందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.
నాని విజయవాడ వైసీపీ టికెట్ వ్యవహారం టీడీపీలో కూడా హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్ ఖాయం అనే నమ్మకం కుదిరిన తర్వాతే ఆయన టీడీపీకి దూరమయ్యారనే చర్చ మొదలైంది. పోనీ చంద్రబాబు సభకు నానీని దూరం పెట్టకపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేం. అటు విజయవాడలో ఎంపీ టికెట్ కోసం వైసీపీనుంచి ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ సడన్ గా నానీ ఎంట్రీతో సీన్ మారింది. ముందే ఒప్పందం కుదిరినా, అప్పటికప్పుడు నానీకి టికెట్ ఖరారైనా.. బెజవాడలో వైసీపీ, టీడీపీ రాజకీయ ముఖచిత్రం మాత్రం స్పష్టంగా మారిపోయింది.
ఎల్లో మీడియాకు సగం పనే..
విజయవాడ ఎంపీ టికెట్ నానీ కాకుండా ఇంకెవరికైనా ఖరారు చేసి ఉంటే.. ఎల్లో మీడియాకు చేతినిండా పని దొరికేది. వైసీపీలోకి వెళ్లి అవమానం పొందారని, తిరిగి ఆయనకు టీడీపీయే గతి అని రాసుకొచ్చేవారు. కానీ ఆయనకు టికెట్ ఖరారు కావడం, అది కూడా పార్టీలో చేరిన వెంటనే కావడంతో ఎల్లో మీడియాకు ఏం రాయాలో, ఏం చేయాలో తోచడంలేదు.