పవన్‌కి సీఎం పోస్ట్ ఆఫర్ చేసిన పాల్
తమ్ముడు పవన్ కల్యాణ్‌ని తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఇంతకుమించిన ఆఫర్ పవన్‌కి ఏ పార్టీ కూడా ఇవ్వదని, ఆలోచించుకోవాలని సూచించారు.
ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీఎం పోస్టును ఆఫర్ చేశారు. జనవరి 1వ తేదీలోగా తమ పార్టీతో పొత్తుకు వస్తే పవన్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీతో పవన్ కల్యాణ్‌ది అపవిత్ర బంధమని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారని, బీజేపీతో పొత్తు పెట్టుకొని అక్కడ పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని పాల్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లలో చేసిన పాలన ఏమీ లేదని ఆయన చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
తమ్ముడు పవన్ కల్యాణ్‌ని తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఇంతకుమించిన ఆఫర్ పవన్‌కి ఏ పార్టీ కూడా ఇవ్వదని, ఆలోచించుకోవాలని సూచించారు. తాము పవన్‌ను పిలుస్తున్నామని.. మంచి ఆఫర్ కూడా ఇచ్చామని, దీనిని కాపు సోదరులు కూడా అర్థం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. కానీ, పవన్ తమ్ముడే అర్థం చేసుకోలేక పోతున్నారని తనదైన శైలిలో పాల్ వ్యాఖ్యానించారు.