ఎంతకాలం కులాన్ని తాకట్టుపెడతారు..?

అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి అరెస్టయితే, కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు.. అని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్.

Advertisement
Update:2024-08-14 09:43 IST

కులాలు కూడు పెడతాయా..?

కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారా..?

ప్రభుత్వంపై బురదజల్లుతారా..?

ఎంతకాలం కులాన్ని తాకట్టు పెడతారు..?

మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పిన మాటలివి. అయితే అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉన్నారు. మంత్రి హోదాలో ఉన్నారు. అమర్నాథ్ గౌడ్ అనే ఓ విద్యార్థి హత్య సమయంలో గౌడ కుల సంఘాలు ఆందోళన చేపడితే అదే సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ వారికి చేసిన ఉపదేశం ఇది.

అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ కులాల గురించి రెండో వెర్షన్ మాట్లాడుతున్నారు. బలహీన వర్గాలనుంచి ఎదిగిన నాయకుడిని, గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడిని చూసి సీఎం చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని, బీసీ నాయకుడిపై రాజకీయ కక్షసాధిస్తున్నారని కులం కార్డు వాడారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.


ఏపీ మంత్రిత అనగాని సత్యప్రసాద్, జోగి రమేష్ గతంలో కులాల గురించి చేసిన వ్యాఖ్యల్ని, ఇప్పుడాయన కులం గురించి చెబుతున్న మాటల్ని పోలుస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి అరెస్టయితే, కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు.. అని చెప్పారు మంత్రి అనగాని. 

Tags:    
Advertisement

Similar News