వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తా..
అమరావతి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. తాను కూడా చూశానని కొన్ని చోట్ల పాదయాత్ర చేస్తున్న వారిపై వాటర్ బాటిళ్లు విసిరారని.. అలా హింసించడం సరికాదన్నారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. విశాఖ ప్రజలను తనకు గొప్ప మద్దతు ఇచ్చారని కాబట్టి వారికి రుణపడి ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. రాజకీయాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం ముఖ్యమన్నారు.
అమరావతి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. తాను కూడా చూశానని కొన్ని చోట్ల పాదయాత్ర చేస్తున్న వారిపై వాటర్ బాటిళ్లు విసిరారని.. అలా హింసించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారివారి అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఉంటుందన్నారు. పైగా అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నప్పుడు అడ్డుకోవడం, అందులోనూ ప్రభుత్వమే ఆ వాతావరణాన్ని సృష్టించడం మంచిది కాదన్నారు.
హైకోర్టు ఇది వరకే అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసిందని.. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. అక్కడ తీర్పు వచ్చే వరకైనా ప్రభుత్వం సంయమనం పాటించాలన్నారు. అలా కాకుండా అడ్డంకులు సృష్టించడం మంచిది కాదన్నారు.కేవలం నాలుగు భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ది జరగడం, పెట్టుబడులు రావడం జరగదన్నారు. విశాఖలో నాలుగు ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే కొత్తగా వచ్చే మార్పు ఏమీ ఉండదన్నారు. అదే విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నారు.