జేపీ విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందా..?

ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ సమావేశంలో జేపీ మాట్లాడుతూ అమరావతి కేంద్రంగానే మొత్తం అభివృద్ధంతా జరగాలన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక లాగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

Advertisement
Update:2022-10-17 14:22 IST

లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పూర్తిస్థాయి రాజకీయనేత కాదు. మేధావివర్గం నుండి రాజకీయాల్లోకి దూకిన ఐఏఎస్ అధికారి. కాబట్టి జేపీ మాటలకు, అభిప్రాయాలకు జనాల్లో విలువుంటుంది. మిగిలిన రాజకీయనేతల్లా ఆయన కూడా అవసరార్థం మాటలు మారుస్తారని, అభిప్రాయాలు మార్చుకుంటారని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు జేపీ చేసిందిదే. ఇంతకాలం చెప్పిందానికి ఇప్పుడు పరస్పర విరుద్ధంగా మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ సమావేశంలో జేపీ మాట్లాడుతూ అమరావతి కేంద్రంగానే మొత్తం అభివృద్ధంతా జరగాలన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక లాగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు. ఇదే జేపీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టే కరెక్టన్నారు. సంక్షేమపథకాల అమలును ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్నది రాష్ట్రప్రభుత్వం హక్కని చెప్పారు. విద్య, వైద్యరంగాలకు జగన్ ప్రభుత్వం బాగా ఇంపార్టెన్స్ ఇస్తోందని కితాబిచ్చారు. గతంలో జేపీ అభిప్రాయాలను యూట్యూబ్ లో చూడొచ్చు.

ఇంతకాలంగా మాట్లాడుతున్నదానికి హఠాత్తుగా ఇప్పుడు మాట్లాడినదానికి ఏమన్నా పొంతనుందా ? జేపీ లాంటి మనిషి కూడా ఫక్తు రాజకీయ నేతగానే ఎందుకు నాలుకమడతేశారు..? ఎందుకంటే క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానంగా ఉంది. క్విడ్ ప్రోకో అంటే నీకిది నాకది అని ఒప్పందం చేసుకోవటమే. ఇప్పుడు జేపీ అర్జెంటుగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించటం చాలా అవసరమని సమావేశం తీర్మానించింది. జేపీ పార్లమెంటులో లేకపోతే ఏపీ అంధకారమైపోవటం ఖాయమన్నట్లుగా మాట్లాడుతున్నారు.

లోక్ సత్తా తరపున పోటీచేస్తే జేపీ గెలుపు కాదుకదా కనీసం డిపాజిట్టు కూడా రాదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన మద్దతుతో పోటీచేయాలని నిర్ణయించుకున్న‌ట్లున్నారు. పై రెండుపార్టీల మద్దతు కావాలంటే కచ్చితంగా జగన్‌ను వ్యతిరేకించాల్సిందే కదా. అందుకనే ఇంతకాలం చంద్రబాబు, పవన్ అభిప్రాయాలతో విభేదిస్తున్న జేపీ ఒక్కసారిగా వాళ్ళతో గొంతు కలిపారు. చూస్తుంటే ఎంపీగా గెలవటం కోసమే పై రెండుపార్టీలతో జేపీ క్విడ్ ప్రోకో చేసుకున్నట్లుంది.

Tags:    
Advertisement

Similar News