ఎన్నికల వేళ జనసేనకు షాక్.. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్

హ్యాకర్లు జనసేన వీడియోలను ఛానల్ నుంచి తొలగించి బిట్ కాయిన్ వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మార్చారు.

Advertisement
Update:2024-04-13 22:16 IST

ఎన్నికల వేళ జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది. ఎన్నికల సమయం కావడంతో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సమావేశాలు ప్రచారానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఛానల్ హ్యాక్ కావడంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.

సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సోషల్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురికావడం కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో జనసేన పార్టీకి చెందిన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావడం ఆ పార్టీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో నాయకులతో సమావేశమై ఎన్నికలు ఎదుర్కోవడంపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానల్‌ హ్యాక్ అయ్యింది.

హ్యాకర్లు జనసేన వీడియోలను ఛానల్ నుంచి తొలగించి బిట్ కాయిన్ వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మార్చారు. ఆ ఛానల్‌కు హ్యాకర్లు మైక్రో స్ట్రాటజీ అనే పేరు పెట్టారు. ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సభలు, సమావేశాలు యూట్యూబ్‌లో ఉంచాల్సిన అవసరం ఉండడంతో ఆ ఛానల్‌ను రికవరీ చేసే పనిలో జనసేన నాయకులు నిమగ్నమయ్యారు.

Tags:    
Advertisement

Similar News