కేంద్ర కేబినెట్‌లోకి జనసేన.. ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వ మంత్రి వ‌ర్గంలో తెలుగుదేశంతో పాటు జనసేనకు చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిలో భాగస్వామి అయిన ప్రతి పార్టీకి ఒక సహాయమంత్రి పదవి తప్పనిసరిగా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

Advertisement
Update: 2024-06-07 03:57 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీ రోల్ ప్లే చేసింది. కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌.. పోటీ చేసిన అన్నిస్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.

అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రి వ‌ర్గంలో తెలుగుదేశంతో పాటు జనసేనకు చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిలో భాగస్వామి అయిన ప్రతి పార్టీకి ఒక సహాయమంత్రి పదవి తప్పనిసరిగా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి కూడా కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కనుందని సమాచారం.

తాజా ఎన్నికల్లో జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు. కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీలుగా విజయం సాధించారు. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్రంలో సహాయ మంత్రి పదవి దక్కనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News