జ‌న‌సేన అభ్య‌ర్థుల లిస్టు రెడీ.. ప‌వ‌న్‌కు పంపిన‌ జోగ‌య్య‌..

రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరాలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Update:2024-02-15 15:06 IST

టీడీపీతో పొత్తు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తామనే విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తేల్చరు. కాపు నాయకుడు హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌పై ఒత్తిడి పెడుతూ లేఖల మీద లేఖలు రాస్తుంటారు. తాజాగా హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌కు మరో లేఖ రాశారు. జనసేన దక్కించుకోవాల్సిన సీట్ల సంఖ్యను తెలియజేస్తూ ఏయే స్థానాలను దక్కించుకోవాలో చెప్పుతూ ఆయన లేఖ రాశారు. అంతేకాకుండా ఏయే సీట్లలో ఎవరెవరిని పోటీకి దింపాలో కూడా ఆయన సూచించారు.

రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరాలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ సీట్లను దక్కించుకోవాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా

1. నర్సాపురం - పవన్‌ కల్యాణ్‌

2. భీమవరం - పవన్‌ కల్యాణ్‌

3. తాడేపల్లి గూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌

4. నిడదవోలు - చేగొండి సూర్యప్రకాశ్‌

5. ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాస్‌

6. ఏలూరు - రెడ్డి అప్పలనాయ్డు (తూర్పు కాపు) లేదా నారా శేషు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా

1. పిఠాపురం - తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌

2. కాకినాడ సిటీ - చిక్కాల దొరబాబు

3. కాకినాడ రూరల్ - పంతం నానాజీ

4. రాజమండ్రి రూరల్ - కె. దుర్గేష్‌

5. రాజానగరం - బత్తుల బాలకృష్ణ

6. కొత్తపేట - బండారు శ్రీనివాస్‌

7. రామచంద్రాపురం - పోలిశెట్టి చంద్రశేఖర్‌

ఉమ్మడి విశాఖ జిల్లా

1. పెందుర్తి - పంచకర్ల రమేష్‌

2. యలమంచిలి - సుందరపు విజయకుమార్‌

3. చోడవరం - శివశంకర్‌

4. గాజువాక - సుందరపు సతీష్‌

6. భిమిలీ - పంచకర్ల సందీప్‌

7. విశాఖ ఉత్తరం - పసుపులేటి ఉషా కిరణ్‌

ఉమ్మడి కృష్ణా జిల్లా

1. అవనిగడ్డ - బండ్రెడ్డి రామకృష్ణ లేదా బచ్చు వెంకటనాథ్‌ ప్రసాద్‌

2. పెడన - బూరగడ్డ వేదవ్యాస్‌ లేదా పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)

3. నూజివీడు - బర్మా ఫణిబాబు

ఉమ్మడి గుంటూరు జిల్లా

1 గుంటూరు పడమర - తలసి రామచరణ్‌

2. దర్శి - మద్దిశెట్టి వేణుగోపాల్‌

ఉమ్మడి ప్రకాశం జిల్లా

1. గిద్దలూరు - ఆమంచి స్వాములు

ఉమ్మడి నెల్లూరు జిల్లా

1. కావలి - మువ్వల రవీంద్ర

రాయలసీమ జిల్లాలు

1. మదనపల్లి - శ్రీరామ రామాంజనేయులు

2. చిత్తూరు - ఆదికేశవులు నాయుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి

3. తిరుపతి - కొణిదెల నాగబాబు

4. నంద్యాల - శెట్టి విజయకుమార్‌

5. గుంతకల్లు - మణికంఠ

6. రాజంపేట - ఎమ్‌.వి. రావు

7. అనంతపురం - టీసీ వరుణ్‌

8. పుట్టపర్తి - శివశంకర్‌ (బ్లూమూన్‌ విద్యాసంస్థలు)

9. తంబళ్లపల్లి - కొండా నరేంద్ర

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు

1. ఎడ్చెర్ల - పోగిరి సురేష్‌ బాబు (తూర్పు కాపు)

2. నెల్లిమర్ల - లోకం మాధవి (తూర్పు కాపు)

3. విజయనగరం - గుర్రాల అయ్యలు (తూర్పు కాపు) లేదా పొలవలస యశ్వసిని (తూర్పు కాపు)

4 గజపతినగరం - పడాల అరుణ (తూర్పు కాపు)

పార్లమెంటు నియోజకవర్గాలు

1. నర్సాపురం - మల్లినీడు తిరుమలరావు (బాబి)

2. కాకినాడ - సాన సతీష్‌

3. మచిలీపట్నం - బాల సూరి

4. అనకాపల్లి - కొణిదెల నాగబాబు లేదా బొలిశెట్టి సత్యనారాయణ

5. రాజంపేట - యం.వి. రావు

6. విజయనగరం - గేదెల శ్రీనివాస్‌ (తూర్పు కాపు)

Tags:    
Advertisement

Similar News