రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆరు నెలలుగా కూటమి పాలన జరుగుతున్నా చెక్ పోస్టులు దాటుకుని మరీ బియ్యం వస్తున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? అని జగన్ ప్రశ్నించారు.

Advertisement
Update:2024-12-11 19:48 IST

రేషన్ బియ్యంపై కూటమి ప్రభుత్వం చేస్తోన్న దుష్ఫ్రచారంపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ ఇవాళ తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్లదే, మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, వాళ్లే చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నారు, పోర్టులో కస్టమ్స్ సిబ్బంది వాళ్ల మనుషులే, భద్రతా సిబ్బంది కూడా వాళ్ల మనుషులే... అయినప్పటికీ బియ్యం తరలిపోతున్నాయంటే ఎవరు కారణం? ఆరు నెలలుగా కూటమి పాలన జరుగుతున్నా చెక్ పోస్టులు దాటుకుని మరీ బియ్యం వస్తున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు.

మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎక్స్ పోర్ట్ లో నెంబర్ వన్ గా ఉన్నారు... ఇటీవల పోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారంటున్నారు... కానీ పయ్యావుల వియ్యంకుడు ఎగుమతులు చేస్తున్న ఆ షిప్ ను మాత్రం తనిఖీ చేయలేదు అంటూ జగన్ ఆరోపించారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు?. అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

Tags:    
Advertisement

Similar News