తిరుమల లడ్డూ కల్తీ నేపధ్యంలో జగన్ కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ కల్తీ నేపధ్యంలో ఏపీలో ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

Advertisement
Update:2024-09-25 15:41 IST

ఏపీలో ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. టీటీడీ పవిత్రను శ్రీవారి ప్రసాదం విశిష్టతను, తిరుమల వైభవాన్ని వెంకటేశ్వరస్వామి పేరు ప్రఖ్యాతులను శ్రీవారి లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్దితో కావాలని అబద్ధాలాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అపవిత్రం చేశారని జగన్ పేర్కొన్నారు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలని జగన్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు.

చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్దం కావలని వైసీపీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. గత వారం రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజు ఉండనున్నారు. వీరితో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారని ప్రభుత్వం వివరించింది.

Tags:    
Advertisement

Similar News