నేడు పులివెందులకు జగన్.. 3 రోజులు అక్కడే మకాం

ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత, మాజీ సీఎంగా జగన్ తొలిసారి పులివెందుల వెళ్తున్నారు. 3 రోజులపాటు జగన్ పులివెందులలో ప్రజలకు, నేతలకు అందుబాటులో ఉంటారు.

Advertisement
Update:2024-06-22 08:06 IST

తాడేపల్లిలో వైసీపీ ఆఫీసు కూల్చివేత నేపథ్యంలో ఈరోజు జగన్ పులివెందుల పర్యటన ఆసక్తిగా మారింది. గతంలోనే ఈ పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ అయినా అసెంబ్లీ సమావేశాల వల్ల టూర్ వాయిదా పడింది. నిన్న అసెంబ్లీలో జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు, వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆయనతోపాటు అసెంబ్లీకి హాజరయ్యారు. ఈరోజు కూడా సభ జరుగుతుంది, స్పీకర్ ను ఎన్నుకునే ప్రక్రియ ఈరోజు పూర్తవుతుంది. అయితే జగన్ మాత్రం ఈ రోజు సమావేశాలకు రావడంలేదు. పులివెందులకు వెళ్తున్నారు.

ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత, మాజీ సీఎంగా జగన్ తొలిసారి పులివెందుల వెళ్తున్నారు. 3 రోజులపాటు జగన్ పులివెందులలో ప్రజలకు, నేతలకు అందుబాటులో ఉంటారు. సోమవారం ఆయన తిరిగి తాడేపల్లికి వస్తారు. ఈ పర్యటనపై వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయనతోపాటు కీలక నేతలెవరైనా తాడేపల్లికి వెళ్తారా, లేక జగన్ ఒక్కరే మూడు రోజులపాటు అక్కడ ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

భవిష్యత్ ప్రణాళిక..

ఏపీలో టీడీపీ విధ్వంసం మొదలైందన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ రియాక్షన్ ఏంటనేది తేలాల్సి ఉంది. బాధితులకు భరోసా ఉండాలని నేతలకు ఇదివరకే జగన్ సూచించారు. కొంతమందిని నేరుగా నేతలు కలసి పరామర్శించారు. అటు జగన్ కూడా బాధితులను నేరుగా కలసి పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపడతారని తెలుస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన విధి విధానాలు ఈ పర్యటనలో ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా, ప్రజల్లోనే ఉండేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News