ఈవీఎంలు వద్దు.. జగన్ సంచలన ట్వీట్

న్యాయం జరగడం అంటే.. న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం చేసినట్టు కూడా తెలియాలి అని తన ట్వీట్ లో పేర్కొన్నారు జగన్.

Advertisement
Update:2024-06-18 08:19 IST

ఇన్నాళ్లూ ఈవీఎంల విషయంలో వైసీపీ నేతలు అనుమానాలు వెలిబుచ్చేవారు. వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఈవీఎంలపై సందేహాలు ప్రచురించేవారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు. అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ వేశారు. ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్ లు వాడే విధానం రావాలన్నారు జగన్.


న్యాయం జరగడం అంటే.. న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం చేసినట్టు కూడా తెలియాలి అని తన ట్వీట్ లో పేర్కొన్నారు జగన్. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే.. బలంగా ఉన్నట్టు కనపడాలి కూడా అని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లో ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారా జరుగుతాయని, భారత్ లో కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్ లు ఉపయోగించాలని సూచించారు.

వైసీపీ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో గతంలో అదే పార్టీ నేతలు ఈవీఎంల గురించి పాజిటివ్ గా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాల వైరల్ గా మారాయి. 2019లో ఓటమి తర్వాత టీడీపీ నేతలు కూడా ఈవీఎంలపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు విజయం రావడంతో ఈవీఎంలు మంచివేనంటున్నారు. 2019లో ఈవీఎం ఓటింగ్ ని సమర్థించిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత బ్యాలెట్ పేపర్ వైపు మొగ్గుచూపడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News