తొందరలోనే 5 లక్షల గృహ ప్రవేశాలు

ఇన్ని లక్షల ఇళ్ళు నిర్మించి ఒకే రోజు గృహ ప్రవేశాలు చేయటం బహుశా ఇదే మొదటిసారి అవుతుందేమో. ఇళ్ళను నిర్మించటంతో పాటు రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం పక్కాగా ఏర్పాటు చేసింది.

Advertisement
Update:2023-08-30 11:45 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొందరలోనే రికార్డు సృష్టించబోతోంది. పేదల కోసం నిర్మించిన ఇళ్ళలను లబ్ధిదారులకు అందించబోతోంది. ఇందుకోసం ఈ శ్రావణ మాసంలోనే ముహూర్తాన్ని రెడీ చేస్తోంది. ఏకకాలంలో 5 లక్షల మందితో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసం అనువైన ముహూర్తాన్ని నిర్ణయించాలని పండితులను ముఖ్యమంత్రి కార్యాలయం కోరిందని సమాచారం. 5 లక్షల ఇళ్ళకు గనుక ఏకకాలంలో గృహ ప్రవేశాలు జరిగితే అదే దేశంలోనే రికార్డవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇన్ని లక్షల ఇళ్ళు నిర్మించి ఒకే రోజు గృహ ప్రవేశాలు చేయటం బహుశా ఇదే మొదటిసారి అవుతుందేమో. ఇళ్ళను నిర్మించటంతో పాటు రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం పక్కాగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జనవరి నాటేకే 5 లక్షల ఇళ్ళ నిర్మాణం అయిపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. గృహ నిర్మాణ శాఖ అధికారులకు విద్యుత్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులు ఎక్కడికక్కడ సహకారం అందించటంతో ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి.

సెప్టెంబర్ 16వ తేదీకి శ్రావణ మాసం పూర్తయిపోతుంది. కాబట్టి ఆలోగానే అంటే 12వ తేదీన కానీ లేదా 14వ తేదీన కానీ గృహ ప్రవేశ కార్యక్రమంలో జగన్ పాల్గొనే అవకాశముందని సమాచారం. సామర్లకోటలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 10 వ తేదీ వరకు జగన్ లండన్ పర్యటనలో ఉంటారు. తిరిగి రాగానే గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని పెట్టేసుకుంటారు.

అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇళ్ళు నిర్మించింది ప్రభుత్వం. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 42,478 ఇళ్ళని నిర్మించింది. మొత్తం మీద 5 లక్షల ఇళ్ళ నిర్మాణాలను టార్గెట్ పెట్టుకుంటే 500653 ఇళ్ళని నిర్మించింది. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో కూడా ఇళ్ళు కట్టామని చెప్పి సామూహిక గృహ ప్రవేశాలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఏ ఇంటిలో కూడా మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. అందుకనే ఆ ఇళ్ళల్లోకి జనాలు ఎవరు చేరలేదు. అందుకనే జగన్ ఇప్పుడు మౌళిక సదుపాయాలను కూడా నూరు శాతం ఏర్పాటు చేశారు.


Tags:    
Advertisement

Similar News