జగన్‌కు గట్టి స్లోగన్ దొరికిందా? ఆకర్షిస్తున్న హోర్డింగులు
రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి జగన్మోహన్ రెడ్డి గట్టి స్లోగన్ ఒకదాన్ని పట్టుకున్నారు. అదేమిటంటే ‘పేదలు-పెత్తందార్లు మధ్య యుద్ధం’ అని. పేదలకు ప్రతినిధిగా జగన్, పెత్తందార్లంటే చంద్రబాబునాయుడు+ఎల్లో మీడియా అనే అర్ధం వచ్చేట్లుగా ప్రతి బహిరంగసభలో ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయంలో స్గోగన్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి జగన్మోహన్ రెడ్డి అలాంటి గట్టి స్లోగన్ ఒకదాన్ని పట్టుకున్నారు. అదేమిటంటే ‘పేదలు-పెత్తందార్లు మధ్య యుద్ధం’ అని. పేదలకు ప్రతినిధిగా జగన్, పెత్తందార్లంటే చంద్రబాబునాయుడు+ఎల్లో మీడియా అనే అర్ధం వచ్చేట్లుగా ప్రతి బహిరంగసభలోను ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. దాన్నిబట్టే వచ్చే ఎన్నికల్లో పేదలు-పెత్తందార్ల మధ్య యుద్ధమనే స్లోగన్నే జగన్ కాయిన్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.
తన స్లోగన్‌ను సమర్ధించుకుంటు అమరావతిలో పేదలకు పంపిణీ చేసిన 50 వేల ఇళ్ళ పట్టాల సందర్భంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పేదలకు తమ ప్రభుత్వం ఇళ్ళపట్టాలు పంచేందుకు ఎంత స్ధాయిలో న్యాయపోరాటం చేయాల్సొచ్చిందో వివరించి చెప్పారు. జగన్ స్లోగన్‌కు తగ్గట్లే ఇళ్ళపట్టాల పంపిణీని నిరసిస్తూ కొంతమంది ఆందోళనలు చేశారు. దీనికి అదనంగా పేదలు-పెత్తందార్ల మధ్య యుద్ధం అన్న స్లోగన్‌కు ఒక కారికేచర్‌తో కార్టూన్ లాంటి పెద్ద పోస్టునే వైసీపీ తయారు చేసింది.
ఆ పోస్టులో ఒకవైపు చంద్రబాబు, లోకేష్ పల్లకిలో కూర్చునుంటే ఆ పల్లకిని ఎల్లో మీడియా యాజమాన్యాలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు మోస్తుంటారు. మరికొందరు వాళ్ళపక్కనే నిలబడి పేదలపైకి రాళ్ళు విసురుతుంటారు. పోస్టులో రెండోవైపు పేదలుంటే వాళ్ళకి అండగా బాహుబలి ఆకారంలో జగన్ ఉంటారు. పెత్తందార్లు విసురుతున్న రాళ్ళని పేదలకు తగలకుండా జగన్ అడ్డుగా ఉంటారు. జగన్, పేదలుండే భూమి పచ్చగా కళకళలాడుతుంటుంది. పెత్తందార్లుండే భూమి బీడుపడిపోయుంటుంది.
ఇలాంటి పోస్టులను జైంట్ సైజులో తయారుచేయించి చాలా ఊర్లలో ప్రధాన సెంటర్లలో వైసీపీ అంటిస్తోంది. ఈ హోర్డింగులు కూడా జనాలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇవే పోస్టర్లతో హోర్డింగులను తయారుచేయించి ప్రతి నియోజకవర్గంలో అన్నీచోట్లా అంటించాలని వైసీపీ డిసైడ్ అయ్యింది. దీన్నిబట్టే రాబోయే ఎన్నికల్లో పేదలు-పెత్తందార్లనే స్లోగన్నే జగన్ ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు అర్థమైపోతోంది. దీనికి విరుగుడుగా చంద్రబాబు సైకో జగన్ అని ప్రచారం చేయబోతున్నారు. మరిద్దరి స్లోగన్లలో దేన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.