అన్నప్రసాదంలో జెర్రి పడటం అసత్యం
భక్తులు ఈ ప్రచారాన్ని నమ్మొద్దు .. తిరుమల తిరుపతి దేవస్థానం
Advertisement
తిరుమలలోని మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందని భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలు తయారు చేస్తున్నామని తెలిపింది. అంత వేడి అన్నంలో ఏమాత్రం చెక్కు చెదరకుండా జెర్రి ఉందని భక్తుడు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. పెరుగు అన్నాన్ని కలపడానికి ముందు వేడి అన్నం బాగా కలియ పెట్టినప్పుడు జెర్రి రూపు చెదరకుండా ఎలా ఉంటుంది,, ఇది భక్తుడు కావాలని చేసిన చర్య అని భావిస్తున్నామని పేర్కొన్నది. భక్తులు ఈ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
Advertisement