చంద్రబాబుకు బీజేపీ ఉచ్చు బిగిస్తోందా..?
బీజేపీ లేకుండా పవన్ తో మాత్రమే పొత్తుపెట్టుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. అలాగని బీజేపీని కలుపుకునీ వెళ్ళలేకపోతున్నారు. బీజేపీ నుండి జనసేనను విడదీస్తే పర్యవసానాలు ఎలాగుంటాయో చంద్రబాబుకు తెలీందికాదు.
అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది చంద్రబాబు పరిస్థితి. బీజేపీతో పొత్తు పెట్టుకోలేరు అలాగని ధైర్యంగా తిరస్కరించలేకపోతున్నారు. అందుకనే చంద్రబాబు పరిస్థితిని గమనించిన ఎల్లోమీడియా రివర్సులో ‘రండి..మాట్లాడుకుందాం’ అనే హెడ్డింగ్ పెట్టి పెద్ద స్టోరీని అచ్చేసింది. అందులో ఏముందుంటే.. టీడీపీతో పొత్తుకు బీజేపీ వెంటపడుతోందన్నట్లుగా ఉంది. పొత్తులపై గతంలోనే లోకేష్ తన వైఖరిని స్పష్టంచేశారట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పొత్తులను ఫైనల్ చేసుకోవాలని చంద్రబాబుకు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేశారట.
అమిత్ షా పొత్తుల గురించి మాట్లాడేందుకు రమ్మన్నారు కాబట్టి చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారన్నట్లుగా రాసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీజేపీతో పొత్తుకు ఇంతకాలం వెంపర్లాడిందే చంద్రబాబు. టీడీపీతో పొత్తుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీగా ఉన్నా.. బీజేపీతో కలిసి రావాలని చెప్పింది చంద్రబాబే. అందుకనే టీడీపీతో పొత్తుపెట్టుకోవాలని నరేంద్రమోడీ, అమిత్ షా, నడ్డాలతో పవన్ పదేపదే మాట్లాడారు. అయితే అప్పట్లో వాళ్ళసలు చంద్రబాబును పట్టించుకోనేలేదు. పైగా టీడీపీని వదిలేయాలని రివర్సులో పవన్ కే చెప్పారనే ప్రచారం జరిగింది.
చంద్రబాబు పరిస్థితి ఎలా తయారైందంటే.. బీజేపీ లేకుండా పవన్ తో మాత్రమే పొత్తుపెట్టుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. అలాగని బీజేపీని కలుపుకునీ వెళ్ళలేకపోతున్నారు. బీజేపీ నుండి జనసేనను విడదీస్తే పర్యవసానాలు ఎలాగుంటాయో చంద్రబాబుకు తెలీందికాదు. తనపైన నమోదైన కేసుల్లో ఒక్కదాన్ని బీజేపీ కదిలిస్తే చాలు మళ్ళీ జైలు జీవితమే అని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే బీజేపీలేని జనసేనతో పొత్తుకు వెనకాడుతున్నారు.
బీజేపీని కలుపుకుంటే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో బయటపడింది. అలాగే జాతీయ మీడియా సర్వేల్లో కూడా బీజేపీతో పొత్తుంటే నష్టమే అని రిపోర్టుల్లో తేలింది. అప్పటినుండే బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు లోప్రొఫైల్ మైన్ టైన్ చేస్తున్నారు. అయినా సరే బీజేపీతో పొత్తు సమస్యలో నుండి ఎలా బయటపడాలో అర్థంకావటంలేదు. సరిగ్గా ఈ సమయంలోనే పొత్తుగురించి మాట్లాడేందుకు రమ్మని అమిత్ షా నుండి ఫోన్ వచ్చిందట. దాంతో వేరేదారిలేక చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారట.
బీజేపీతో పొత్తుపెట్టుకుంటే జరగబోయే నష్టాన్ని తమ్ముళ్ళు చంద్రబాబుకు చెప్పారని ఎల్లోమీడియానే చెప్పింది. బీజేపీతో పొత్తును టీడీపీ, జనసేన నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తన డిబేట్లో ఎల్లోమీడియానే ప్రకటించింది. అందుకనే టీడీపీతో పొత్తును బీజేపీ కోరుకుంటోందంటూ రివర్సు స్టోరీ రాసింది. పొత్తుకోసం చంద్రబాబు వెంట బీజేపీ పడుతోందనే కలరింగ్ ఇచ్చింది. మొత్తానికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక సమస్య పెట్టుకోకపోతే మరో సమస్యన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.