ప‌వ‌న్‌కు సినిమా మొదలవ్వబోతోందా..?

ఎక్కువలో ఎక్కువ జనసేనకు చంద్రబాబు 28 అసెంబ్లీ సీట్లకన్నా వచ్చేదిలేదని అర్థ‌మవుతోంది. ఇదే నిజమయ్యేట్లయితే పవన్ సినిమా చూడక తప్పదనే అనిపిస్తోంది.

Advertisement
Update:2024-02-05 10:37 IST

చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో మొదలైన ప్రచారం నిజమైతే జనసేన ఇబ్బందులో పడటం ఖాయమనే అనిపిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నిసీట్లలో పోటీచేయాలి..? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీచేయాలనే అంశం ఫైనల్ అయ్యిందట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించారట. అలాగే రెండు లేకపోతే మూడు పార్లమెంటు సీట్లిస్తారట. అటుఇటుగా ఓ పది అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లను పక్కకుతీసి పెట్టాలని అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

కొన్ని సీట్లను ఎందుకు పక్కనపెట్టాలని అనుకున్నారంటే.. బీజేపీ కలిసివస్తే కేటాయించటానికట. సరే జనసేన విషయానికి వస్తే 25 సీట్లకు మించి ఇవ్వటానికి చంద్రబాబు ఇష్టపడలేదని సమాచారం. జనసేనకు సీట్లు పెంచేకొద్దీ టీడీపీకి నష్టం పెరుగుతుంటుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను పవన్ అంగీకరించారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని పార్టీలో కూడా ఒకసారి చర్చించి ఫైనల్ చేస్తానని పవన్ చెప్పారట. కాబట్టి భేటీలో 25 సీట్ల దగ్గర ఫైనల్ అయిన సంఖ్య 8వ తేదీన భేటీకి మహాయితే మరో మూడు పెరుగుతుందని అనుకుంటున్నారు.

అంటే ఎక్కువలో ఎక్కువ జనసేనకు చంద్రబాబు 28 అసెంబ్లీ సీట్లకన్నా వచ్చేదిలేదని అర్థ‌మవుతోంది. ఇదే నిజమయ్యేట్లయితే పవన్ సినిమా చూడక తప్పదనే అనిపిస్తోంది. ఎందుకంటే జనసేన నేతలు, కాపు సామాజికవర్గంలోని పవన్ మద్దతుదారులు 50-60 సీట్ల మధ్య అంచనా వేస్తున్నారు. పొత్తులో పవన్ తక్కువలో తక్కువ 50 సీట్లు తీసుకోవాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబు ఇచ్చే సీట్లకు పవన్ అంగీకరిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు.

గౌరవప్రదమైన సీట్లు అంటే 50కి తక్కువకాకుండా తీసుకుంటేనే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయని హెచ్చరిస్తున్నారు. అలాకాకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావని కాపు ప్రముఖులు బహిరంగంగానే పవన్ కు వార్నింగిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఇచ్చే 25-28 సీట్లను మహాప్రసాదంగా తీసుకుని కష్టపడి పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలా అంటూ ఇప్పటికే కాపుల్లో గోల పెరిగిపోతోంది. తీసుకునేదే 25-28 సీట్లయితే ఇందులో జనసేన ఎన్నిగెలుస్తుందనే చర్చ పార్టీలో మొద‌లైంది. కాబట్టి పోటీచేసే సీట్లు గౌరవప్రదంగా లేకపోతే జనసేన గెలిచే సీట్లు కూడా అలాగే ఉంటాయని జనసైనికులు గోల మొదలుపెట్టేశారు. మరి చివరకు పవన్ ఏమిచేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News