పవన్నే బకరాను చేసిన ఇప్పటం జనాలు

నోటీసులు అందుకుని కూడా తమకు నోటీసులు ఇవ్వలేదని ఇటు పవన్‌తో పాటు అటు కోర్టును కూడా తప్పు దోవపట్టించారు. ఈ విషయం మీదే సీరియస్ అయిన కోర్టు కేసు వేసిన 14 మందికి తలా లక్షరూపాయలు ఫైన్ వేసింది.

Advertisement
Update:2022-11-25 10:16 IST

మొత్తానికి ఓవర్ యాక్షన్ చేసిన ఫలితానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బకరా అయిపోయారు. పవన్ బకరా అయ్యారు అనేదాని కన్నా ఇప్పటంలోని కొందరు జనాలు బకరాని చేశారనేది కరెక్టుగా ఉంటుంది. ఇళ్ళ కూల్చివేత కేసు విచారణలో ప్రభుత్వం తప్పు లేదని, కొంతమంది స్ధానికులు ఉద్దేశ‌పూర్వకంగా రాజకీయ పార్టీలతో పాటు కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని బయటపడింది. రాజకీయ పార్టీల విషయం ఎలాగున్నా కోర్టు మాత్రం చాలా సీరియస్ అయ్యింది.

అందుకనే తమను ఉద్దేశ‌పూర్వకంగా తప్పు దోవపట్టించిన ఇప్పటం గ్రామంలోని 14 మందికి తలా రూ.లక్ష రూపాయల ఫైన్ విధించింది. రోడ్డును ఆక్రమించుకుని చేసుకున్న నిర్మాణాలను తొలగించాలని అధికారులు గ్రామంలోని ప్ర‌జ‌ల‌కు నోటీసులిచ్చారు. అయితే నోటీసులకు స్పందించకపోవటంతో చివరకు అధికారులే యాక్షన్లోకి దిగారు. అధికారులు వచ్చి కూల్చివేతలు మొదలుపెట్టగానే గ్రామంలోని కొందరు గగ్గోలు మొదలుపెట్టారు. ఇంకేముంది ఏ చిన్న సందు దొరికినా దూరిపోయే ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉన్నారు కదా.

వెంటనే ఇప్పటం గ్రామానికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్ల‌ను కూల్చేస్తున్నారంటు కొందరు చేసిన గోలకు పవన్, చంద్రబాబు, ఎల్లో మీడియా వంత పాడారు. పవన్ అయితే మరింతగా రెచ్చిపోయి ప్రభుత్వానికి శాపనార్ధాలు కూడా పెట్టేశారు. ప్రభుత్వం ఇళ్ళని కూల్చేస్తే తాను మానవత్వంతో స్పందించి కూల్చేసిన ప్రతి ఇంటకి లక్షరూపాయలు పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించేశారు.

సీన్ కట్ చేస్తే ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టడమే కాకుండా కొందరు జనాలు కోర్టులో కేసుకూడా వేశారు. అయితే విచారణలో అధికారులు ఇళ్ళ యజమానులకు నోటీసులిచ్చిన విషయం బయపటడింది. అంటే నోటీసులు అందుకుని కూడా తమకు నోటీసులు ఇవ్వలేదని ఇటు పవన్‌తో పాటు అటు కోర్టును కూడా తప్పు దోవపట్టించారు. ఈ విషయం మీదే సీరియస్ అయిన కోర్టు కేసు వేసిన 14 మందికి తలా లక్షరూపాయలు ఫైన్ వేసింది. మరి గ్రామస్తులు చెప్పింది గుడ్డిగా నమ్మేసి ఓవర్ యాక్షన్ చేసిన పవన్ ఏం చేస్తారిపుడు? పవన్ ఏమిచేస్తారో తెలీదుకానీ జనాలు మాత్రం పవన్‌ను బకరాను చేసిన విషయం బయటపడింది.

Tags:    
Advertisement

Similar News