శైలజ మీద యాక్షన్ తప్పదా?

జరిగింది చూసిన తర్వాత శైలజపై యాక్షన్ తీసుకోవటం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే యాక్షన్ సీఐడీ డైరెక్టుగా తీసుకుంటుందా? లేకపోతే డీఆర్ఐ అధికారుల ఫిర్యాదుతో ఎవరు తీసుకుంటారన్నదే తేలాలి. విచారణకు వచ్చిన అధికారులను అడ్డుకోవటం అన్నది కూడా అఫెన్సు కిందకే వస్తుంది.

Advertisement
Update:2023-06-08 10:58 IST

శైలజ మీద యాక్షన్ తప్పదా?

మంగళవారం నాటి పరిణామాలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసాలపై ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజల‌పై సీఐడీ చీటింగ్ కేసులు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. మార్గదర్శిలో అనేక అక్రమాలను గుర్తించినట్లు ఇప్ప‌టికే సీఐడీ ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రామోజీ, శైలజను ఇంతకుముందు వరకు సీఐడీ మాత్రమే విచారించింది. కానీ మొదటిసారి మంగళవారం సీఐడీతో పాటు డీఆర్ఐ అధికారులు కూడా విచారణ బృందంలో ఉన్నారు.

వీళ్ళిద్దరిని విచారించేందుకు సీఐడీ అధికారులు వచ్చారంటే అర్థ‌ముంది. కానీ డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కూడా ఎందుకొచ్చారు? డీఆర్ఐ అధికారులు కూడా విచారణకు వచ్చారంటేనే కేంద్ర ప్రభుత్వం పంపితేనే వచ్చారన్న విషయం అర్థ‌మవుతోంది. చిట్ ఫండ్స్ కంపెనీ పేరుతో రామోజీ దశాబ్దాలుగా చేస్తున్న మోసంపై కేంద్ర ఆర్థికశాఖకు కూడా పూర్తి సమాచారం అందిందని అర్థ‌మవుతోంది. బహుశా సీఐడీనే మార్గదర్శి మోసాలకు సంబంధించిన వివరాలన్నింటినీ డీఆర్ఐకి అందించుంటుంది.

రిపోర్టును చూసి కన్వీన్స్ అయిన తర్వాతే డీఆర్ఐ కూడా విచారణకు రంగంలోకి దిగింది. మంగళవారం డీఆర్ఐ అధికారులను విచారణ కోసం మార్గదర్శి సిబ్బంది ఇంట్లోకి అనుమతించలేదు. వీటన్నింటినీ డీఆర్ఐ అధికారులు ప్రత్యక్షంగా గమనించారు. ఏ తప్పూ చేయకపోతే తమను విచారణకు ఎందుకు అనుమతించటంలేదనే అనుమానం డీఆర్ఐ అధికారులకు వచ్చే ఉంటుంది. తమ అనుమానాన్ని అంతకుముందే సీఐడీ ఇచ్చిన రిపోర్టుతో నిర్ధారణ చేసుకునుంటారు. ఇదివరకే కేంద్ర దర్యాప్తు సంస్థ‌లకు సీఐడీ మార్గదర్శి మోసాలు, ఆధారాలు తదితరాలపై డిడైల్డ్ రిపోర్టిచ్చింది.

జరిగింది చూసిన తర్వాత శైలజపై యాక్షన్ తీసుకోవటం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే యాక్షన్ సీఐడీ డైరెక్టుగా తీసుకుంటుందా? లేకపోతే డీఆర్ఐ అధికారుల ఫిర్యాదుతో ఎవరు తీసుకుంటారన్నదే తేలాలి. విచారణకు వచ్చిన అధికారులను అడ్డుకోవటం అన్నది కూడా అఫెన్సు కిందకే వస్తుంది. పైగా విచారణలో ఎండీ తమకు సహకరించలేదని సీఐడీ అడిషినల్ ఎస్పీ రవికుమార్ మీడియా సమావేశంలో ఆరోపించారు. గతంలో కూడా శైలజ ఇలాగే వ్యవహరించారు. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శైలజ మీద యాక్షన్ తీసుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది.

Tags:    
Advertisement

Similar News