ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం
తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదన్న ఏపీ డిప్యూటీ సీఎం
తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామన్నారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ హయాంలో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని పవన్ తెలిపారు. మహిళల భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
అటవీ శాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ తెలిపారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు రూ. 5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానన్నారు. భవిషత్తులో అటవీ అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులర్పిద్దాం. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తామన్నారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నది. విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అమరుల స్మరణకు ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్‌లకు వారి పేర్లు పెట్టాలని పవన్ కల్యాణ్ అన్నారు.