ఛాలెంజ్‌ను జగన్ స్వీకరిస్తే చంద్రబాబు పరిస్థితేంటి..?
రాబోయే ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఒక బీసీ నేతను పోటీకి దింపే అవకాశాలున్నాయనే టాక్ పార్టీలో మొదలైంది. పులివెందులను బీసీ నేతకు కేటాయించి తాను జమ్మలమడుగు లేదా ఉత్తరాంధ్రలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయచ్చనే చర్చ పెరిగిపోతోంది.
ఈమధ్య తండ్రీకొడుకులు బాబు, లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ బీసీ నేతను పోటీచేయిస్తారా..? అని. దానికి కౌంటరుగా సజ్జల లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పోటీచేస్తున్న కుప్పం, లోకేష్ పోటీచేయబోతున్న మంగళగిరి, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం పేర్లను ప్రస్తావించారు. పై మూడు నియోజకవర్గాల్లో ఏది కూడా వీళ్ళ సొంత నియోజకవర్గాలు కావు. ఎక్కడినుండో వీళ్ళంతా అక్కడికి వలసవెళ్ళి పోటీ చేస్తున్నవారే.
అందుకనే పైమూడు నియోజకవర్గాల్లో టీడీపీ బీసీలను పోటీచేయిస్తుందా..? అని సజ్జల లాంటి వాళ్ళు ఎదురు ఛాలెంజ్‌లు విసిరారు. వీళ్ళ వ్యవహారాలు ఎలాగున్నా ఒకవేళ చంద్రబాబు, లోకేష్ ఛాలెంజ్‌లను జగన్ స్వీకరిస్తే.. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి..? అన్న విషయమై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఒక బీసీ నేతను పోటీకి దింపే అవకాశాలున్నాయనే టాక్ పార్టీలో మొదలైంది. పులివెందులను బీసీ నేతకు కేటాయించి తాను జమ్మలమడుగు లేదా ఉత్తరాంధ్రలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయచ్చనే చర్చ పెరిగిపోతోంది.
నిజంగానే పులివెందులలో బీసీ నేతను పోటీచేయిస్తే అప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏమి మాట్లాడుతారు..? మొదటినుండి జగన్ బీసీ సామాజికవర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కాబట్టి తండ్రీకొడుకుల ఛాలెంజ్‌ను జగన్ స్వీకరిస్తే అప్పుడు చంద్రబాబు, లోకేష్ కు ఇబ్బందులు తప్పవు. పులివెందులలో బీసీని పోటీచేయించి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. దాన్ని ఎవరూ కాదనలేరు.
అప్పుడు చిత్తశుద్ధి అనే ప్రశ్నకు చంద్రబాబు, లోకేష్, బాలయ్య సమాధానం చెప్పుకోవాలి. తాము పోటీచేస్తున్న కుప్పం, మంగళగిరి, హిందూపురం నియోజకవర్గాలను బీసీలకు చంద్రబాబు కేటాయించగలరా..? కేటాయించకపోతే వైసీపీ, బీసీ సంఘాలు వదిలిపెడతాయా..? కేటాయించకపోతే బీసీల్లో టీడీపీకి మైనస్ అవ్వదా..? పులివెందుల కాకపోయినా జగన్ ఎక్కడ పోటీచేసినా గెలుస్తారు. మరి చంద్రబాబు, లోకేష్, బాలయ్యలు వేరే నియోజకవర్గాల్లో పోటీచేసేంత ధైర్యం చేస్తారా..? పోటీచేసినా గెలుస్తారా..?