చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలి.. - కొడాలి నాని ఛాలెంజ్
నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లేనని, వారిద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎంపీలు అయ్యారని చెప్పారు. పవన్ మాత్రం పార్టీ పెట్టి.. రెండు చోట్ల పోటీచేసి.. ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీచేయాలని మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. గుడివాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో నాని మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ గుడివాడకు చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన చెప్పారు. తన ఊపిరి ఉన్నంతవరకు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని నాని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ 16 పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏం సాధించాడని కొడాలి నాని ప్రశ్నించారు. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లేనని, వారిద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎంపీలు అయ్యారని చెప్పారు. పవన్ మాత్రం పార్టీ పెట్టి.. రెండు చోట్ల పోటీచేసి.. ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని ఎద్దేవా చేశారు.
రెండు పార్టీలను కలుపుకుంటే గానీ అసెంబ్లీకి వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్‌ను సీఎం సీటు నుంచి కదిపే దమ్ము, సత్తా చంద్రబాబుకు, పవన్‌కు లేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని ఆయన చెప్పారు.