జగన్ తిరుమల లడ్డూ అపవిత్రం చేశారని నేను ఎప్పుడూ అనలేదు : పవన్ కళ్యాణ్

దేశంలో లౌకికత్వం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు

Advertisement
Update:2024-10-03 20:17 IST

సనాతన ధర్మాన్ని రక్షించేందుకు బలమైన చట్టం కావాలని ఈ యాక్ట్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని వారాహి డిక్లరేషన్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో కేంద్రానికి పలు సూచనలు చేస్తూ డిక్లరేషన్‌‌ను పవన్ రిలీజ్ చేశారు. నా ప్రాణం పోయేవరకు సనాతన ధర్మం కోసమే పోరాడతాని అన్నారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేశారని పవన్ తెలిపారు. అలాంటి వారికి చెబుతున్నా.. నేను సనాతనీ హిందువును. కానీ నేను ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిజంని గౌరవిస్తాని డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు. నా సనాతన ధర్మాన్ని అంతం చేస్తానంటున్న సెక్యులరిస్టులను మరోసారి హెచ్చరిస్తున్నా.. నా ప్రాణం పోయేవరకు సనాతన ధర్మం కోసమే పోరాడతాని పవన్ కళ్యాణ్ శపధం చేశారు. సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయి..

చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం, దయ చూపిస్తాయిని పవన్ పేర్కొన్నారు. అయిన వాళ్లకి ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించింది..ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతుల్లో పెట్టి నాక్కోమంటురని జగన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం కేంద్రం ఫండ్స్ విడుదల చేయాలని సూచించారు. అన్ని ఆలయాల్లో ప్రసాదంలో వినియోగించే నాణ్యమైన వస్తువులు సరఫరా చేసి ధ్రువీకరించే విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, విద్యా, కళా, ఆర్థిక, పర్యావరణ, కేంద్రాలుగా తయారు చేయాలని కోరారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. నా ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ఎప్పుడూ మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని కోరుకోదని అన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారని, హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని పవన్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News