చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం

నేడు విచారణకు రాగా.. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఏఏజీ సుధాకర్ రెడ్డి కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది.

Advertisement
Update:2023-09-13 12:40 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. లంచ్‌ మోషన్‌గా అత్యవసరంగా విచారించాలని కోరగా బుధవారం విచారిస్తామని కోర్టు చెప్పింది. నేడు విచారణకు రాగా.. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఏఏజీ సుధాకర్ రెడ్డి కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది.

విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. అదే సమయంలో ప్రస్తుతం ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, దానిపై విచారణను ఆపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు అంగీకరించింది. ఈనెల 18 వరకు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.

ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, పెట్టిన సెక్షన్లు వర్తించవంటూ హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేశారు.

Tags:    
Advertisement

Similar News