చింతకాయలపై మండిపోయిన హైకోర్టు

ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అసభ్య పదజాలం ఉపయోగించటం ఏమిటంటే మండిపోయింది. అయ్యన్న పదజాలం ముమ్మాటికి తీవ్ర అభ్యంతరకరమే అంటూ ఆక్షేపించింది.

Advertisement
Update:2023-09-07 11:20 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నుండి కింద స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డిపై నోరుపారేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా బూతులు కూడా తిట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళల్లో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మొదటివరుసలో ఉంటారు. ఆయన ఎక్కడ మాట్లాడినా, మీడియా సమావేశం నిర్వహించినా జగన్‌ను వ్యక్తిగతంగా మాట్లాడుతు బూతులు తిట్టేస్తుంటారు. అందుకనే లోకేష్ యువగళంలో కూడా అలాగే తిడితే పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేసి వదిలిపెట్టారు.

మళ్ళీ తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం చింతకాయల కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు అయ్యన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అసభ్య పదజాలం ఉపయోగించటం ఏమిటంటే మండిపోయింది. అయ్యన్న పదజాలం ముమ్మాటికి తీవ్ర అభ్యంతరకరమే అంటూ ఆక్షేపించింది. ఇలాంటి మాటలను ఎంతమాత్రం అనుమతించేదిలేదని స్పష్టంగా చెప్పింది.

అయ్యన్న వాడుతున్న బూతులు ఎంతవరకు ఆమోదయోగ్యమో చెప్పాలని హైకోర్టు ఆయ‌న‌ లాయర్‌నే ప్రశ్నించింది. దానికి లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో అయ్యన్నకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడంలో తప్పేమీలేదని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే చింతకాయలను విచారించేందుకు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన విషయాన్ని పోలీసుశాఖ తరపు లాయర్ జడ్జికి గుర్తుచేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు తొందరలోనే చింతకాయలను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రంగం సిద్ధమైంది. కోర్టే స్వయంగా నోటీసులిచ్చి విచారించమని చెప్పింది కాబట్టి ఇక అయ్యన్నకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు.

మరి పోలీసులు ఎప్పుడు రంగంలోకి దిగుతారు అయ్యన్నను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో చూడాలి. ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టడం చింతకాయలకు బాగా అలవాటైపోయింది. ఎందుకంటే పోలీసులు అరెస్టులు చేయటానికి వచ్చినపుడల్లా తప్పించుకుని పారిపోతున్నారు. ముందస్తు బెయిల్ తెచ్చుకుని మళ్ళీ ప్రత్యక్షమవ్వటం అలవాటైపోయింది. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్ వచ్చేస్తోంది, కాబట్టి భయం లేకుండా బూతులు తిట్టేస్తున్నారు. వినటానికి కూడా ఇబ్బందిగా ఉండేంత బూతులు తిడుతున్నారు. చింతకాయలే కాదు చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు. కాకపోతే అందిరిలోకి చింతకాయల స్పెషల్ అంతే.


Tags:    
Advertisement

Similar News