ఆస్తుల వివాదంపై జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో సరస్వతీ పవర్ కేసుకు సంబంధించి జగన్ పిటిషన్‌పై విచారణ డిసెంబర్‌ 13వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
Update:2024-11-08 14:39 IST

విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేషల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో సరస్వతీ పవర్ కేసుపై విచారణ జరిగింది. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి, చెల్లిపై మాజీ సీఎం కోర్టుకెళ్లారు. ఆయన వేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని తల్లి విజయమ్మ కోరారు. వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిల తరపున న్యాయవాది సమయం కోరారు.

దీంతో కేసు విచారణను డిసెంబర్‌ 13వ తేదీకి వాయిదా వేస్తూ ఎన్‌సీఎల్‌టీ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. కాగా తనకు తెలియకుండానే క్రమక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల, జనార్దన్‌రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్‌ చెప్పారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కొరారు

Tags:    
Advertisement

Similar News