జగన్ చేస్తోంది అదే కదా.. పవన్ కల్యాణ్ గారూ?

రిజర్వేషన్ల డిమాండ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని చెప్పారు. జగన్ చేసిన పని అదే కదా.. తాను రిజర్వేషన్లు కల్పించలేనని వారికి మేలు చేసే పథకాలను అమలు చేస్తున్నారు కదా.. దీనిపై పవన్ కల్యాణ్ ఏమంటారు?

Advertisement
Update:2024-05-10 14:11 IST

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటులో, టికెట్ల పంపకంలో కాపులను చాలా వరకు ముంచేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా వారిని నిండా ముంచేశాడు. కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. గతంలో కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం తన చేతుల్లో లేదని, తాను ఆ హామీని ఇవ్వలేనని, ఇతరత్రా వారికి మేలు చేస్తానని 2019 ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు. చెప్పినట్లుగానే జగన్ కాపుల కోసం కాపు నేస్తం వంటి పథకాలను ప్రవేశపెట్టారు, కాపు కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి కన్నా ఎక్కువ కాపులకు సీట్లు కేటాయించారు.

పవన్ కల్యాణ్ మాత్రం తనను నమ్ముకున్న కాపు నాయకులను కూడా ముంచేశారు. వారికి టికెట్లు ఇవ్వలేదు. చంద్రబాబు నిర్ణయం మేరకు టీడీపీ నుంచి దిగుమతి అయిన నాయకులకు టికెట్లు ఇచ్చారు. దీంతో కాపులు పవన్ కల్యాణ్ మీద తీవ్రంగా మండిపడుతున్నారు. కాపులు రాజ్యాధికారం దిశగా సాగే ప్రక్రియకు పవన్ కల్యాణ్ తూట్లు పొడిచారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాపు రిజర్వేషన్లపై ప్రకటన చేశారు. కోరుకునేవారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

ఈ రిజర్వేషన్ల డిమాండ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని చెప్పారు. జగన్ చేసిన పని అదే కదా.. తాను రిజర్వేషన్లు కల్పించలేనని వారికి మేలు చేసే పథకాలను అమలు చేస్తున్నారు కదా.. దీనిపై పవన్ కల్యాణ్ ఏమంటారు?

రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదని, తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన అన్నారు. రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ఆయన అన్నారు.

కాపుల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనిపెట్టి అమలు చేస్తున్నారనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు గుర్తించడం లేదు? ఆయనకు దానికన్నా ముఖ్యం చంద్రబాబు నాయుడు విజయం సాధించడం. చంద్రబాబుకు కొమ్ము కాస్తూ కాపులనే కాదు, అన్ని వర్గాలను కూడా ముంచడానికి ఆయన సిద్ధపడ్డారు. కాపుల రిజర్వేషన్లకు చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలేమైనా కనిపెట్టారా, వాటిని అమలు చేస్తానని హామీ ఏమైనా ఇచ్చారా? ఈ ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పాల్సే ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News