నెయ్యి కల్తీపై సీబీఐతో విచారణ చేయించండి

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

Advertisement
Update:2024-09-28 19:08 IST

నెయ్యి కల్తీపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం వైజాగ్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నెయ్యి కల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తుందన్నారు. నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని సీఎం అంటున్నారని, నెయ్యి కల్తీని ఆయన నిరూపించాలని డిమాండ్‌ చేశారు. నెయ్యి కల్తీపై సుప్రీం కోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలన్నారు. సీబీఐ విచారణ కోసం చంద్రబాబు కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్‌ వేసుకున్నారని తెలిపారు. కల్తీ నిజమైతే న్యాయ విచారణకు ఎందకు వెనుకాడుతున్నారు, స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో నాలుగు వేల మంది కార్మికులను తొలగిస్తే స్పందన లేదన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.25 వేల కోట్ల అప్పు చేశారని, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా అని ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News