టీడీపీతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదు - బుద్ధా వెంకన్న

జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అండ్‌ కో దూరం పెడుతున్నారన్న విషయం విధితమే. నిజానికి లోకేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లను పోలిస్తే టీడీపీ క్యాడర్‌ జూ.ఎన్టీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటుంది.

Advertisement
Update:2024-05-25 10:10 IST

జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో వెంకటకృష్ణ నిర్వహించే ది డిబేట్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బుద్దా వెంకన్న జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని పదే పదే జూ.ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువస్తున్నారని.. ఇది వాళ్లకు అవసరం లేని అంశమన్నారు బుద్దా.

తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌ శకం మొదలైదంటూ ఈ డిబేట్‌ నిర్వహించింది ABN. నవయువనేత అంటూ లోకేష్‌కు ఓ ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చేసింది. నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేయడం విశేషం.


జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అండ్‌ కో దూరం పెడుతున్నారన్న విషయం విధితమే. నిజానికి లోకేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లను పోలిస్తే టీడీపీ క్యాడర్‌ జూ.ఎన్టీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటుంది. అచ్చెన్న, కళా వెంకట్రావు లాంటి సీనియర్ నేతలు సైతం ఇప్పటికే చాలా సార్లు లోకేష్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ అదే భావనతో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆయన ఫ్లెక్సీలతో కనిపించారు. జూ.ఎన్టీఆర్‌ కోసం నినాదాలు చేశారు. ఐతే కొన్ని చోట్ల టీడీపీలోని ఓ వర్గం జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై దాడులు కూడా చేశారు. లోకేషే ఈ దాడులు చేయించారన్న విమర్శలూ ఉన్నాయి.

నిజానికి తన తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీగా టీడీపీపై జూనియర్‌కు అభిమానం ఉంది. ఇందులో భాగంగానే 2009లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టీడీపీ కోసం ప్రచారం చేశారు జూ.ఎన్టీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కానీ ఆ ఎన్నికల తర్వాతే చంద్రబాబు నిజ స్వరూపం జూ.ఎన్టీఆర్‌కు సాక్షాత్కరించింది. అప్పటి నుంచి చంద్రబాబుకు, పార్టీకి వీలైనంత దూరం పాటిస్తున్నారు. 2009 ఎన్నికల తర్వాత ఏనాడూ పార్టీ గురించి కానీ, రాజకీయాల గురించి కానీ జూ.ఎన్టీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ చంద్రబాబును మాత్రం ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ భయం వెంటాడుతూనే ఉంది.

Tags:    
Advertisement

Similar News