తప్పంతా ఈవీఎంలదే.. కేతిరెడ్డి మరో వీడియో

ఎన్నికల ఫలితాల సమయంలో కూడా గోల్ మాల్ జరిగిందని అంటున్నారు కేతిరెడ్డి. ఫలితాలు వచ్చే సమయంలో కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయంటూ ఫేక్ ప్రచారం జరిగిందని, ఈసీ వెబ్ సైట్లో పెట్టడానికి ముందే టీవీ ఛానెళ్లలో మెజార్టీలు వచ్చేశాయని అన్నారాయన.

Advertisement
Update:2024-06-14 08:33 IST

"అందరూ మాకే ఓట్లు వేశామంటున్నారు, మరి ఆ ఓట్లు ఏమయ్యాయి, ఎక్కడికిపోయాయి. ఈవీఎంలో వేసిన ఓట్లు, చివరికి ఈసీ లెక్కతేల్చిన ఓట్ల మధ్య ఎందుకంత గ్యాప్ ఉంది." అంటూ వీడియో విడుదల చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అన్నిటికీ ఆధార్ ని లింక్ చేసే ప్రభుత్వాలు, ఓటుకి మాత్రం ఎందుకు ఆధార్ ని లింక్ చేయడం లేదని లాజిక్ తీశారు. తానేదో ఓడిపోయానని మాట్లాడటంలేదని, వాస్తవాలు చెబుతున్నానని అన్నారు. వెబ్ సైట్లు, మీడియాలో వచ్చిన కథనాలను కేతిరెడ్డి తన వీడియోలో ప్రస్తావించారు.


ఎన్నికల ఫలితాల సమయంలో కూడా గోల్ మాల్ జరిగిందని అంటున్నారు కేతిరెడ్డి. ఫలితాలు వచ్చే సమయంలో కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయంటూ ఫేక్ ప్రచారం జరిగిందని, ఈసీ వెబ్ సైట్లో పెట్టడానికి ముందే టీవీ ఛానెళ్లలో మెజార్టీలు వచ్చేశాయని అన్నారాయన. ఆ మెజార్టీలు చూసిన తర్వాత కౌంటింగ్ ప్రాంతంలో కూడా వాతావరణం మారిపోయిందని, వైసీపీ ఏజెంట్లందరూ నిరాశతో బయటకు వెళ్లారని.. ఆ తర్వాత లోపల ఉన్న సిబ్బంది తమకి కావాల్సినట్టు ఫలితాలను మార్చుకున్నారని, భారీ మెజార్టీలు అలానే సాధ్యమయ్యాయని చెప్పారు కేతిరెడ్డి.

వారికి ముందుగానే ఎలా తెలుసు..?

ప్రశాంత్ కిషోర్, అశ్వనీదత్ సహా కొన్ని మీడియా సంస్థలు కూటమికి 160 స్థానాలంటూ కచ్చితంగా చెప్పాయని.. వారికి ముందుగానే ఫలితాలు ఎలా తెలిశాయంటూ నిలదీస్తున్నారు కేతిరెడ్డి. ఫలితాలను వారు తారుమారు చేశారనే అనుమానం ఉందన్నారు. అయితే నెటిజన్లు మాత్రం కేతిరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అవే ఈవీఎంలలో వైసీపీకి 40శాతం ఓట్లు వచ్చాయని.. మరి దాని గురించి మాట్లాడరెందుకని ప్రశ్నిస్తున్నారు. 40శాతం ఓట్లు నిజమా..? వైసీపీకి వచ్చిన సీట్లు నిజమా..? తేల్చుకోవాలంటున్నారు నెటిజన్లు. 

Tags:    
Advertisement

Similar News