తగ్గేదే లేదు.. రుషికొండపై రోజా ట్వీట్

హైదరాబాద్ లో సొంతిల్లు ఉన్నా కూడా.. హయత్ హోటల్ కు లక్షల రూపాయలు ప్రజా ధనం అద్దె రూపంలో చెల్లించిన వాళ్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోజా.

Advertisement
Update: 2024-06-19 03:28 GMT

ఏపీలో రుషికొండ అంశం రాజకీయ సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇ్పపుడు మరో మాజీ మంత్రి రోజా కూడా రుషికొండ భవనాల గురించి కొత్త ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. వైసీపీ నేతల్ని, జగన్ ని ఎంతగా టార్గెట్ చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటాన్ని ఆపేది లేదని, వెన్ను చూపేది, వెనకడుగు వేసిది లేదని తేల్చి చెప్పారు రోజా.


రోజా ప్రశ్నలివి..

- రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..?

- విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..?

- 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?

- 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం... ఇందులో అక్రమం ఎక్కడుంది..?

- విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?

- ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?

- ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపరచిన మాట వాస్తవం కాదా...?

- ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?

హైదరాబాద్ లో సొంతిల్లు ఉన్నా కూడా.. హయత్ హోటల్ కు లక్షల రూపాయలు ప్రజా ధనం అద్దె రూపంలో చెల్లించిన వాళ్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోజా. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లకు 40 కోట్ల రూపాయలతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లు ఈరోజు తమపై నిందలు వేయడమేంటని ఎద్దేవా చేశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు తమను విమర్శించే అర్హత లేదన్నారు రోజా. అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు కట్టించామని వివరణ ఇచ్చారామె. 

Tags:    
Advertisement

Similar News