నారాయణ బెయిల్ రద్దు

నారాయణ బెయిల్ రద్దు కోసం ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌ రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రశ్నాపత్నం లీకేజ్‌లో నారాయణకు సంబంధం ఉందని .. కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని పోలీసుల తరపున పిటిషన్‌ పిటిషన్ వేశారు.

Advertisement
Update:2022-10-31 14:57 IST

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు అయింది. అరెస్ట్‌ అయిన గంటల వ్యవధిలోనే నారాయణకు బెయిల్ రావడం, పోలీసుల తరఫున‌ బలంగా వాదనలు వినిపించే విషయంలో ప్రభుత్వ న్యాయవాది నిరాకరించడంతో మే నెలలో నారాయణకు బెయిల్ సులువగా వచ్చేసింది.

ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ అవడం అప్పట్లో దుమారం రేపింది. పోలీసులు ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేసి అదంతా కుట్రపూరితంగా నారాయణ కనుసన్నల్లోనే జరిగిందని తేల్చారు. ఆ కేసులో మే 10న నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆయన్నుచిత్తూరు కోర్టులో హాజరుపరచగా వెంటనే బెయిల్ వచ్చేసింది. నారాయణను చిత్తూరు కోర్టులో హాజరుపరిచగా అభియోగాలపై వాదించే విషయంలో స్థానిక మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ ఒకరు విముఖత చూపారు. దాంతో నారాయణకు బెయిల్ రావడం ఈజీ అయింది. ఆ తర్వాత ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

నారాయణ బెయిల్ రద్దు కోసం ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌ రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రశ్నాపత్నం లీకేజ్‌లో నారాయణకు సంబంధం ఉందని .. కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని పోలీసుల తరపున పిటిషన్‌ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన చిత్తూరు కోర్టు.. నారాయణ బెయిల్ రద్దు చేసింది. నవంబర్‌ 30లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News