ప్రజల అత్యాశ వల్లే కూటమి గెలుపు.. నైతిక విజయం వైసీపీదే

2014లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా, ఏపీ ప్రజలు అత్యాశకు పోయి, భ్రమపడి కూటమికి ఓట్లు వేసి ఉంటారని అన్నారు మాజీ మంత్రి ధర్మాన.

Advertisement
Update:2024-06-28 17:42 IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకే ఓట్లు ఎక్కువ వచ్చాయని లాజిక్ చెప్పారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఐదో పార్టీ వైసీపీ అని అన్నారు. కూటమి కట్టి గెలిచారు కాబటట్టి టీడీపీ, జనసేన, బీజేపీది నైతిక విజయం కాదన్నారు. ఏపీలో నైతిక విజయం వైసీపీదేనని తేల్చి చెప్పారు. కూటమి కట్టడం వల్లే వారు గెలిచారని, అయినా తాము ప్రజా తీర్పుని గౌరవిస్తామన్నారు ధర్మాన. గెలుపు ఓటములు సహజం అని, తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ ప్రజల అత్యాశ

2014లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా, ఏపీ ప్రజలు అత్యాశకు పోయి, భ్రమపడి కూటమికి ఓట్లు వేసి ఉంటారని అన్నారు మాజీ మంత్రి ధర్మాన. కూటమి మేనిఫెస్టోని బీజేపీ కూడా సమర్థించలేదని, ఆ రోజు కూడా వారి మేనిఫెస్టోపై ఆ పార్టీకి నమ్మకం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీదే అధికారం అని అన్నారాయన. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు వారికి తొందరలోనే దూరమవుతారన్నారు. గతంలో వారికి కేవలం 23 సీట్లు వచ్చాయని, ఇప్పుడు వచ్చిన సీట్లు చూసుకుని పొంగిపోవద్దని హెచ్చరించారు ధర్మాన.


టీడీపీ కార్యాలయాలని తామెప్పుడూ టార్గెట్ చేయలేదని, ఇప్పుడు వైసీపీ కార్యాలయాలను ఎందుకు కూల్చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ధర్మాన. జగన్ సింహం లాంటి వారని, రెచ్చగొడితే ఊరుకోరని, రియాక్షన్ సీరియస్ గా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కలిసినప్పుడే నిబ్బరంగా జగన్ ఎదుర్కొన్నారని, ఆయన అత్యంత ఆలోచనాపరుడు, విజ్ఞత ఉన్నవారు అని చెప్పారు ధర్మాన. జగన్ అంటే ఎప్పటికీ చంద్రబాబుకి భయమేనని అందుకే పార్టీ ఆఫీస్ లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News