వైసీపీకి మాజీ ఐఏఎస్ గుడ్‌బై
వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ రాజీనామా చేసారు.
వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ రాజీనామా చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని పేర్కొన్నారు. ఇక మీదట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. 2019లో వైసీపీ గెలిచాక ఇంతియాజ్ అహ్మద్ కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ సమయం సమీపిస్తుండడంతో, ఆయన రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు.
దాంతో, జగన్ ఆయనను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా, కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం కాదని టికెట్ కేటాయించారు. ఈ స్థానంలో టీడీపీ నుంచి టీజీ భరత్ గెలుపోందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతియాజ్ అహ్మద్ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించింది లేదు. ఐఏఎస్ నుండి వీఆర్‌ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అయితే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను కానీ.. ప్రజాసేవకు కాదు అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు