ఉత్కంఠ‌కు తెర‌.. వైసీపీ థర్డ్‌ లిస్ట్ విడుద‌ల‌

తాజాగా 21 మందితో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ. రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన తర్వాత సీఎం జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Update:2024-01-12 01:24 IST

రాబోయే ఎన్నికల కోసం పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 21 మందితో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ. రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన తర్వాత సీఎం జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పార్లమెంట్‌ స్థానం ఇన్‌ఛార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ, విజయవాడ పార్లమెంట్‌ స్థానం ఇన్‌ఛార్జిగా కేశినేని నాని, కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా కారుమూరు సునీల్‌ కుమార్‌, తిరుపతి పార్లమెంట్ స్థానం ఇన్‌ఛార్జిగా కోనేటి ఆదిమూలం, శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగించింది.

పార్లమెంటరీ స్థానాల ఇన్‌ఛార్జిలు వీరే -

శ్రీకాకుళం పార్లమెంట్‌ - పేరాడ తిలక్‌

విశాఖ ఎంపీ - బొత్స ఝాన్సీ

ఏలూరు పార్లమెంట్‌ - కారుమూరి సునీల్‌ కుమార్‌

విజయవాడ పార్లమెంట్‌ - కేశినేని నాని

కర్నూలు పార్లమెంట్‌ - గుమ్మనూరి జయరామ్

తిరుపతి పార్లమెంట్‌ - ఆదిమూలం ( ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే)




అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు

ఇచ్చాపురం -పిరియ విజయ

టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్‌

చింతలపూడి - కంభం విజయరాజ్

రాయదుర్గం - మెట్టు గోవింద రెడ్డి

దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

పూతలపట్టు - ఎం.సునీల్‌

చిత్తూరు - విజయానంద రెడ్డి

మదనపల్లి - నిస్సార్ అహ్మద్‌

రాజంపేట -ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి

ఆలూరు - విరూపాక్షి

కోడుమూరు - డాక్టర్‌ సతీష్‌

గూడూరు - మేరిగ మురళి

సత్యవేడు - గురుమూర్తి

పెనమలూరు - జోగి రమేష్‌

పెడన - ఉప్పల రాము

Tags:    
Advertisement

Similar News