జగన్ నవ్వినా రామోజీకి కడుపు మంటేనా..?

అసెంబ్లీలో జగన్ ఉద్దేశపూర్వకంగా పగలబడి నవ్వలేదే.. సందర్భానుసారం ఆయన నవ్వుతూ కనిపించారు, మిగతా సభ్యుల మాటలను చప్పట్లు కొడుతూ అభినందించారు. అది తప్పన్నట్టుగా ఈనాడు రాతలు మరీ విడ్డూరం అనిపిస్తున్నాయి.

Advertisement
Update:2023-09-28 08:25 IST

ఏపీ సీఎం జగన్, సభలు, సమావేశాల్లో నవ్వుతూనే కనపడతారు. అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తారు, అది ఆయన నైజం. అసెంబ్లీలో కూడా ఆయన చిక్కగా నవ్వే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఈ అసెంబ్లీ సెషన్ లో కూడా ఆయన నవ్వుతూనే కనిపించారు. కానీ ఆ నవ్వు రామోజీకి నచ్చలేదు. అందుకే ఈనాడులో ఓ ఆర్టికల్ వేసేశారు. జగన్ కి సంబంధించిన అరడజను ఫొటోలు ప్రింట్ చేసి మరీ ముఖ్యమంత్రికి ఇదేం ఆనందమో..! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎందుకీ కడుపుమంట..?

చంద్రబాబు జైలులో ఉన్నారు, జగన్ అసెంబ్లీలో నవ్వుతూ కనిపించారు. ఇదే రామోజీ కడుపు మంటకు కారణం. చంద్రబాబు జైలులో ఉంటే ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఇంకా కొంతమంది టీడీపీ నాయకులకు బాధ ఉండొచ్చేమో. అంతమాత్రాన వారందరూ నవ్వకుండా ఉన్నారా..? చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య సెల్ఫీలతో హడావిడి చేసిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. సొంత బామ్మర్దే అన్నీ మరచిపోయి సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయినప్పుడు మిగతా ప్రపంచమంతా చంద్రబాబుకోసం బాధపడుతూ రోడ్డెక్కాలంటే ఎలా..? ఈ లాజిక్ రామోజీ ఎందుకు మిస్సయ్యారు..? చంద్రబాబు బాధని, జగన్ సంతోషాన్ని ముడిపెట్టడం దేనికి..?

అసెంబ్లీలో జగన్ ఉద్దేశపూర్వకంగా పగలబడి నవ్వలేదే.. సందర్భానుసారం ఆయన నవ్వుతూ కనిపించారు, మిగతా సభ్యుల మాటలను చప్పట్లు కొడుతూ అభినందించారు. అది తప్పన్నట్టుగా ఈనాడు రాతలు మరీ విడ్డూరం అనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈనాడు కడుపుమంట బయటపడింది, ఇప్పుడు జగన్ నవ్వడాన్ని కూడా తప్పుబడుతున్నారంటే అది ఏ స్థాయికి చేరుకుందో తేలిపోతోంది. 

Tags:    
Advertisement

Similar News