జేసీ అరెస్టుకు రంగం సిద్ధమైందా ?

సో.. జరుగుతున్నది చూస్తుంటే కచ్చితంగా జేసీ ప్రభాకరరెడ్డిని అరెస్టు చేయటానికి రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సోమవారం జేసీపై కోర్టులో చార్జిషీటు ఫైల్ చేయబోతున్నారట.

Advertisement
Update:2022-10-08 11:48 IST

ఏపీ రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ గురించి కొత్తగా పరిచయం అవసరంలేదు. ఏ పార్టీలో ఉన్నా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంటారు. కొద్దిరోజులుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎందుకనో కామ్ గా ఉన్నా.. తమ్ముడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మాత్రం వివాదాల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళగురించి ఎందుకంటే తాజాగా ప్రభాకరరెడ్డిని ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది.

అప్పుడెప్పుడో అశోక్ లేల్యాండ్ కంపెనీ నుండి స్క్రాప్ రూపంలో 154 లారీలు, బస్సులు కొన్నారు. వాటి కొనుగోళ్ళు, మళ్ళీ వాటిని ఫ్రెష్ బస్సులుగా తయారుచేయించటం, వాటి రిజిస్ట్రేషన్లు, పత్రాల తయారీలో సంతకాల ఫోర్జరీ లాంటి చాలా ఆరోపణలపై ఈడీ విచారించింది. నిజానికి ఇవేవీ ఈడీ విచారించాల్సిన అవసరంలేదు. లోకల్ పోలీసులు, ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తే సరిపోతుంది. అయితే ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందంటే ఈ మొత్తం వ్యవహారంలో మనీల్యాండరింగ్ కోణం కూడా ఉందట.

సో.. జరుగుతున్నది చూస్తుంటే కచ్చితంగా జేసీ ప్రభాకరరెడ్డిని అరెస్టు చేయటానికి రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సోమవారం జేసీపై కోర్టులో చార్జిషీటు ఫైల్ చేయబోతున్నారట. చార్జిషీటు ఫైల్ చేసిన తర్వాత ఇప్పటికే ఉన్న ఆరోపణలపై జేసీని అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది. మనీల్యాండరింగ్ లాంటిది ఏమీ లేదని జేసీ కొట్టేస్తున్నా ఈడీ ఇదే కోణంలో దర్యాప్తుచేస్తోంది. వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాల్లో ఫోర్జరీ జరిగినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రవాణాశాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదు ప్రకారమే వీళ్ళపై కేసులు కూడా నమోదైంది.

అశోక్ లేల్యాండ్ నుండి బస్సులు, లారీల స్క్రాప్ కొని వాటిని ఎక్కడో రిపేర్లు చేయించి బస్సుల రూపంలోకి తీసుకొచ్చి కొందరికి వాటిని సెకండ్ హ్యాండ్ బస్సులని అమ్మేశారనే ఆరోపణలపై గతంలో విచారించటం, నిర్ధారించ‌డం అన్నీ జరిగిపోయాయి. బస్సులు కొన్నవాళ్ళని అరెస్టుచేసినప్పుడు తాము జేసీ ట్రావెల్స్ నుండి కొన్నట్లు విచారణలో చెప్పారు. కాబట్టి తాజాగా ఈడీ విచారణ నేపథ్యంలోనే జేసీ ప్రభాకరరెడ్డి, భాగస్తుల్లో కొందరి అరెస్టు ఖాయమని అర్థ‌మవుతోంది.

Tags:    
Advertisement

Similar News