16 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ
నవంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం
16 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు నిర్వహించిన టెట్ ఫలితాలు నవంబర రెండో తేదీన ప్రకటించి ఆ మరుసటి రోజే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నం ముమ్మర యత్నాలు చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా టెట్, డీఎస్సీ పరీక్షలకు మధ్య కనీసం మూడు నెలల వ్యవధి ఉండాలనే విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేశారు. ఏపీ డీఎస్సీ సిలబస్ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం కూడా ఉత్తదేనని.. గత నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టుగానే సిలబస్ ఉంటుందని తెలిపారు. ఇరత వివరాల కోసం విద్యాశాఖ వెబ్ సైట్ సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.