చంద్రబాబు లాయర్‌ సిద్దార్థ్‌ లూథ్రా.. ఆయన ఫీజు ఎంతో తెలుసా?

ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు రోజుకు కోటి 50 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. ఫ్లైట్‌ ఖర్చులు, లగ్జరీ కారు, స్టార్‌ హోటల్‌లో బస ఫీజుకు అదనమని తెలుస్తోంది.

Advertisement
Update:2023-09-10 09:48 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐతే చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు దేశంలోనే టాప్‌ లాయర్లలో ఒకరైన సిద్దార్థ్‌ లూథ్రాను తెలుగుదేశం నియమించుకుంది. సిద్ధార్థ్ లూథ్రా శనివారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు.సిద్ధార్థ్ లూథ్రా గతంలో చంద్రబాబు తరపున సుప్రీం కోర్టులో అనేక కేసుల్లో వాదించారు. గతంలో అమరావతి భూముల కేసులో సైతం వాదనలు వినిపించారు. వైఎస్‌ సునీతా తరపున వైఎస్‌ వివేకా హత్య కేసులో కూడా వాదించారు.

దేశంలోని టాప్‌ లాయర్లలో లూథ్రా ఒకరు. దాదాపు మూడు దశాబ్ధాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న సిద్ధార్థ్‌ లూథ్రా.. 2004 నుంచి 2007 వరకు సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిథ్యం వహించారు. 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమాకమయ్యారు. 2010లో తన ప్రాక్టీస్‌ను ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మార్చారు.

ఇక కేసులు వాదించేందుకు లూథ్రా భారీగా ఫీజు వసూలు చేస్తారని సమాచారం. ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు రోజుకు కోటి 50 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. ఫ్లైట్‌ ఖర్చులు, లగ్జరీ కారు, స్టార్‌ హోటల్‌లో బస ఫీజుకు అదనమని తెలుస్తోంది.

ఇక చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏపీ సీఐడీ తరపున ఏపీ అడిషనల్ ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వైసీపీ తరపున గట్టి వాదనలు వినిపించడంలో సుధాకర్‌ రెడ్డి దిట్ట. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున అనేక కేసులు సుధాకర్‌ రెడ్డి వాదించారు.


Tags:    
Advertisement

Similar News