సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన : జగన్
సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే పడుకుంటా అని తెలిపారు.
సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తాని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం 4 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతా అంటూ కీలక ప్రకటన చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి పార్లమెంటులో బస చేస్తానని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నడుము కడతానని తెలిపారు.
అడుగడుగునా సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కూడా వ్యాఖ్యానించారు తాను మీ అందరినీ కోరేది ఒక్కటే.. మన పోరాట పటిమ సన్నగిల్లకూడదంటూ జగన్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ‘‘16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను. అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయిన్నారు.