చంద్రబాబు ఆరోగ్యవంతుడని మీరే చెప్పేశారు.. థ్యాంక్స్.. టీడీపీపై వర్మ సెటైర్లు
చంద్రబాబు జైలుకు వెళ్లకముందు ఆయన ఉన్నంత ఫిట్ గా మరెవరూ ఉండరని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు.. ఆయన జైలుకు వెళ్లగానే చంద్రబాబు ఎన్నో రోగాలతో బాధపడుతున్నారని.. ఆయనకు బెయిల్ ఇప్పించాలని వేడుకున్నారు.
సిల్క్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి అలా జైలుకు వెళ్లారో లేదో.. ఆయనకసలు ఆరోగ్యమే బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టుల చుట్టూ తిరిగారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు టీడీపీ పోస్ట్ చేసిన ఫొటో ద్వారా తెలుస్తుండగా.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని మీకు మీరే రుజువు చేసినందుకు.. ధన్యవాదాలు తెలియజేస్తున్నానని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ టీడీపీపై సెటైర్లు వేశారు.
సిల్క్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదని కోర్టులకు విన్నవించారు. చంద్రబాబుకు ఇన్ఫెక్షన్, స్కిన్ అలెర్జీ ఉందని, అనారోగ్య సమస్యలతో బరువు తగ్గారని, కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని, డీహైడ్రేషన్ తో ఇబ్బంది పడుతున్నారని కోర్టుల దృష్టికి తీసుకువచ్చారు.
చంద్రబాబు జైలుకు వెళ్లకముందు ఆయన ఉన్నంత ఫిట్ గా మరెవరూ ఉండరని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు.. ఆయన జైలుకు వెళ్లగానే చంద్రబాబు ఎన్నో రోగాలతో బాధపడుతున్నారని.. ఆయనకు బెయిల్ ఇప్పించాలని వేడుకున్నారు. చివరికి హైకోర్టు కూడా ఆయనకు కంటి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
అయితే అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు జైలు నుంచి విడుదల కాగానే వెంటనే ఏ ఆస్పత్రికో వెళ్లకుండా.. 14 గంటల పాటు ర్యాలీ నిర్వహించి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కూడా ఆస్పత్రికి వెళ్లకుండా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీనిని బట్టి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని టీడీపీ సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్టు ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే క్రమంలో జగన్‌తో పోలిస్తే చంద్రబాబు ఆరోగ్యవంతుడని పరోక్షంగా పేర్కొంది టీడీపీ. జైలు నుంచి ఇంటికి చేరుకున్న చంద్రబాబు ఇంట్లో దేవుడి చిత్రపటాల వద్ద వంగి కొబ్బరికాయ కొడుతున్న ఫొటోను టీడీపీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.
'73 ఏళ్ల వయస్సు.. అక్రమ కేసులో 52 రోజులు జైలులో ఉండి అనారోగ్యంతో బయటకొచ్చిన బాబు వంగి కొబ్బరి కాయ కొట్టారు. 50 ఏళ్ల వయస్సు.. సీఎం అయిన నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాటాలంటే ప్రత్యేక విమానం, హెలికాప్టర్. అయినా వంగి కొబ్బరి కాయ కొట్టలేడు జగన్. భక్తి లేకపోవడమా? ఆసక్తి లేకపోవడమా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి' అని టీడీపీ ట్వీట్ చేసింది.
ఈ పోస్ట్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడని మీకు మీరే చెప్పినందుకు థ్యాంక్స్.. అంటూ ట్వీట్ చేశాడు. టీడీపీపై వర్మ వేసిన సెటైర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు టీడీపీకి సెటైర్లు వేస్తున్నారు.