అబ్బాయ్‌పై బాబాయ్ ఎఫెక్ట్ తప్పదా ?

ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి రెండురోజుల క్రితం నెల్లూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరిని ఒకచోటకు చేర్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేట్లు చేశారు.

Advertisement
Update:2023-05-15 10:59 IST

నెల్లూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయి. బాబాయ్ రాజకీయాన్ని బహుశా అబ్బాయ్ తట్టుకోలేక పోతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. తాను తొందరలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. మాజీ మంత్రి ప్రకటన ఒక్కసారిగా పార్టీలో సంచలనమైంది. అనిల్ ఎందుకింత హఠాత్తుగా ఈ ప్రకటన చేశారంటే అందుకు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ రాజకీయాలను తట్టుకోలేకపోతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే.. అనిల్‌కు రూప్ కుమార్ సొంత బాబాయే. 2014, 2019 ఎన్నికల్లో అనిల్ విజయంలో బాబాయ్ కష్టంకూడా ఉంది. అలాంటిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ మంత్రయితే రూప్ కుమార్ నెల్లూరు డిప్యుటీ మేయరయ్యారు. ఇద్దరికి పదవులు వచ్చేసరికి ఎక్కడో గట్టుతగాదాలు మొదలైనట్లున్నాయి. మెల్లిగా విభేదాలు మొదలై బాగా పెరిగిపోయాయి. అనిల్ పేరుచెప్పి రూప్ కుమార్ విపరీతంగా సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువైపోయాయి.

దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవ్వటంతో వేర్వేరు క్యాంపులు పెట్టుకున్నారు. బాబాయ్ కు తనకు సంబంధాలు లేవని స్వయంగా మంత్రే ఒకప్పుడు ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే అనిల్ మాజీ మంత్రయిపోయారు. అయితే రూప్ కుమార్ మాత్రం డిప్యుటీ మేయర్ గానే ఉన్నారు. దాంతో బాబాయ్ ఆధిప‌త్యం మొదలైంది. దాన్ని అనిల్ తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ గొడవలు చివరకు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. అనిల్ వచ్చేఎన్నికల్లో గెలిచేది అనుమానమే అనే ప్రచారం జరిగిపోయేంతగా..

ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి రెండురోజుల క్రితం నెల్లూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరిని ఒకచోటకు చేర్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేట్లు చేశారు. అయితే అది అప్పటి ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకంటే జగన్ పర్యటన అయిన రెండురోజులకే అవసరమైతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని అనిల్ ప్రకటించారంటే అర్థ‌మేంటి..? అబ్బాయ్-బాబాయ్ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ముదిరిపోయాయో అర్థ‌మైపోతోంది. చివరకు వచ్చేఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News