మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం
బాధిత కుటుంబలకు ప్రకటించిన పరిహారాన్ని మూడు రోజుల్లోపు అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని విశాఖపట్నం జిల్లా హరేందిర ప్రసాద్ గురువారం ప్రకటించారు. విశాఖపట్నం కేజీహెచ్ వద్ద మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పంచనామా, పోస్టుమార్టానికి సహకరించాలని వారిని కోరారు.
అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించి సంబంధిత ఫార్మా కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బాధిత కుటుంబలకు ప్రకటించిన పరిహారాన్ని మూడు రోజుల్లోపు అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. సాల్వెంట్ లీకేజీ వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు ఆయన చెప్పారు.
అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు జరిగిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు పరిహారం అందించడానికి నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు కలెక్టర్‌తో ఈ విషయం చెప్పించినట్టు తెలుస్తోంది.