ఆ చానల్‌వాళ్లు నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు - పోసాని
వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారన్న ధీమాతో వీరు రెచ్చిపోతున్నారని విమర్శించారు. తెలుగులో ఇన్ని చానళ్లు ఉన్నప్పటికీ సాంబశివరావు వాడుతున్న భాషను ఏ చానల్ వారైనా వాడుతున్నారా అని ప్రశ్నించారు.
టీవీ5కి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీకి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. మరోసారి మాట్లాడితే నీ అంతు చూస్తా అంటూ టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఆన్ స్క్రీన్ వార్నింగ్ ఇవ్వడంపై పోసాని ఫైర్ అయ్యారు. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడవద్దు అన్నందుకు చంపేస్తారా అని ప్రశ్నించారు.
బూతులతో సమాజాన్ని ప్రశ్నించే హక్కు మీడియాకు ఏ రాజ్యాంగం ఇచ్చిందని ప్రశ్నించారు. దాన్ని తాను ఖండిస్తే అంతుచూస్తా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ సాంబశివరావు బెదిరించారన్నారు. బూతులు మాట్లాడటమే కాకుండా తెలంగాణ బిడ్డను అంటూ తెలంగాణ కార్డు వాడుకుంటున్నారని విమర్శించారు.
చిత్ర పరిశ్రమలోని ఆడవారిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. అదేంటి అంటే జర్నలిస్ట్‌గా మాట్లాడే హక్కు ఉందని మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు సాంబశివరావు ఎక్కడ జర్నలిజం చేశారో చెప్పాలన్నారు. టీవీ5 సాంబశివరావు గతంతో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టేవారని.. ఆ తర్వాత మూడు నాలుగు పెట్రోల్ బంకులకు యజమాని అయ్యారన్నారు. అది కూడా వైఎస్‌ఆర్ పుణ్యమేనన్నారు. వైఎస్ దగ్గరకు వెళ్లి కాళ్లకు దండం పెట్టి బతిమలాడుకుంటే బతుక్కోపో అని భిక్ష పెట్టారన్నారు.
ఇప్పుడు సాంబశివరావు, బీఆర్ నాయుడు కలిసి ''పోసాని నిన్ను చంపేస్తాం'' అనే స్థాయికి వెళ్లారన్నారు. టీవీ5 ప్రారంభించే సమయంలో ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్లి చానల్ పెట్టుకుంటా అంటూ 30 కోట్లు తెచ్చుకున్నారని.. ఇప్పటికీ ఆ డబ్బును వెనక్కు ఇవ్వకుండా వేధిస్తున్నారని పోసాని ఆరోపించారు. బంజారాహిల్స్‌లో ఉండే ఒక మార్వాడీ దగ్గర బీఆర్ నాయుడు రూ.12 కోట్లు తెచ్చుకున్నారన్నారు. అతడు డబ్బు పదేపదే అడుగుతుండడంతో తుపాకీ తీసుకెళ్లి చంపేస్తానని బెదిరించారని పోసాని ఆరోపించారు. బీఆర్ నాయుడు చరిత్ర చూస్తే పోసాని అనే తనను చంపడం చాలా ఈజీ పని అన్నారు.
వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారన్న ధీమాతో వీరు రెచ్చిపోతున్నారని విమర్శించారు. తెలుగులో ఇన్ని చానళ్లు ఉన్నప్పటికీ సాంబశివరావు వాడుతున్న భాషను ఏ చానల్ వారైనా వాడుతున్నారా అని ప్రశ్నించారు. టీవీ5 వాళ్లకు మీరైనా చెప్పి ఆ సాంబశివరావును తిరిగి పెట్రోల్ బంక్‌లకు పంపేలా చూడాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశారు. టీవీ5 సాంబశివరావు ఏపీలోని ఆడవారికి క్షమాపణ చెప్పే వరకు తాను మాట్లాడుతూనే ఉంటానన్నారు.