కుప్పం ప్రజల ద‌శాబ్దాల కల సాకారం కాబోతోంది

పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ద్వారా మంచినీరు, సాగు నీరు అందించడానికి అప్పట్లో 1,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల మీదుగా ప్రత్యేకంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను నిర్మించింది.

Advertisement
Update:2024-02-19 15:35 IST

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ప్రజల కలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాకారం చేయబోతున్నారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేయలేని పనిని వైఎస్‌ జగన్‌ చేసి చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణానికి హంద్రీనీవా జలాలను విడుదల చేయ‌నున్నారు. ఈ జలాల కోసం కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కుప్పం పట్టణం దాహార్తిని తీర్చే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కుప్పం పట్టణానికి హంద్రీ- నీవా నుంచి నీటిని ఇవ్వడానికి ఉద్దేశించిన డీపీఆర్‌ను వైఎస్సార్‌ ప్రభుత్వం అప్పట్లో అంగీకరించింది. పెద్ద తిప్పసముద్రం నుంచి కుప్పం వరకు పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ను నిర్మించాలని తలపెట్టారు.

పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ద్వారా మంచినీరు, సాగు నీరు అందించడానికి అప్పట్లో 1,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల మీదుగా ప్రత్యేకంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను నిర్మించింది. దీనికి అదనంగా 418 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణం పనుల దశలవారీగా పూర్తయ్యాయి. దీంతో కుప్పం పట్టణ ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఈ నెల 26వ తేదీన నీటిని విడుదల చేస్తారు. తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. తన నియోజకవర్గానికి కూడా ఆయన ఏమీ చేయలేదు. ఇప్పుడు జగన్‌ చంద్రబాబు నియోజకర్గంలోని కుప్పం పట్టణ ప్రజలకు మేలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News