పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ సాయం నేడే
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల్లో వివాహం చేసుకున్న 10,132 జంటలకు మొత్తం రూ. 78.53 కోట్ల సాయం ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద అర్హులైనవారికి నేడు సాయం విడుదల చేయనుంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల్లో వివాహం చేసుకున్న 10,132 జంటలకు మొత్తం రూ. 78.53 కోట్ల సాయం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి పెళ్లికుమార్తె తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
గత ఏడాది 427 కోట్ల సాయం
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రతి మూడు నెలలకోసారి సాయం అందిస్తున్నారు. ఆ మూడు నెలల్లో ఈ పథకం కింద నమోదు చేసుకున్నవారందరికీ తర్వాత నెలలో సాయం జమ చేస్తున్నారు. 2022 అక్టోబర్ -డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ -డిసెంబర్ వరకు మొత్తం 5 విడతల్లో 56,194 మందికి ఈ సాయం అందించారు. దీని విలువ మొత్తం రూ.427.27 కోట్లు.