అచ్చెన్నాయుడుకి అర్థ‌మ‌య్యేలా చెప్పిన జగన్

మీరు మా కుటుంబసభ్యుల జోలికి రావడం మానుకోకపోతే.. మా పార్టీ నేతలు కూడా అదే తరహాలో సహజంగానే రియాక్ట్ కావాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
Update:2022-09-15 13:21 IST

బీఏసీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కుటుంబసభ్యులపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రులు బీఏసీ సమావేశంలో అభ్యంతరం తెలిపారు. ఆ సమయంలో మనం రాజకీయ నాయకులు కాబట్టి మనలో మనం ఎన్నో అనుకుంటాం.. కానీ కుటుంబసభ్యుల జోలికి రావడం సరైదని కాదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు.. తొలుత కొడాలి నాని, వల్లభనేని వంశీల నుంచే ఇది మొదలైందని ఆరోపించారు. అందుకు స్పందించిన సీఎం జగన్.. ముమ్మాటికీ టీడీపీ నుంచే ఇది మొదలైందని వ్యాఖ్యానించారు.

మీరు మా కుటుంబసభ్యుల జోలికి రావడం మానుకోకపోతే.. మా పార్టీ నేతలు కూడా అదే తరహాలో సహజంగానే రియాక్ట్ కావాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల జోలికి రావడం మీరు ఆపేస్తే.. వైసీపీ నుంచి అలాంటి దాడి ఆటోమెటిక్‌గా ఆగిపోతుందన్నారు.

తమ పార్టీ ఎప్పుడూ కూడా కుటుంబసభ్యులను టార్గెట్ చేయాలని అనుకోదన్నారు. మొదలుపెట్టిన మీరే ఆపేయాలన్నారు. మీరు ఒకటి అంటే మా వాళ్లు పది అనగలరు అన్న విషయాన్ని గుర్తించుకోవాలని అచ్చెన్నాయుడుకి జగన్ స్పష్టం చేశారు. కుటుంబాల్లో ఆడవారిని లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదని అచ్చెన్నాయుడు కూడా అంగీక‌రించారు. టీడీపీ ఏ అంశంపై చర్చించాలన్నా అందుకు తాము సిద్ధమని బీఏసీలో జగన్‌ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News