‘జగనన్న విద్యా దీవెన’ నిధులు విడుదల.. - 9.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నామని సీఎం చెప్పారు.

Advertisement
Update:2024-03-01 15:26 IST

జగనన్న విద్యా దీవెన నిధులు రూ.708.68 కోట్లు సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం విడుదల చేశారు. కృష్ణాజిల్లా పామర్రులో నిర్వహించిన కార్యక్రమంలో బ‌ట‌న్ నొక్కి 9.44 లక్షల మంది విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లోకి న‌గ‌దు జ‌మ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వసతి దీవెన, విద్యాదీవెన కోసం నేటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

చంద్రబాబు పేదవిద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటని ఈ సందర్భంగా జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు మాత్రమే గుర్తుకొస్తుందని విమర్శించారు. పిల్లలకు మంచి చేయడం కోసం చంద్రబాబు అండ్ కోపై తాను యుద్ధం చేస్తున్నానని జగన్‌ తెలిపారు. పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నామని సీఎం చెప్పారు.

మన రాష్ట్రంలోని పిల్లలు రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడతారని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే మన పిల్లలకు కావాలి.. దానికి తగ్గట్టు విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నామని తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ విధానాన్ని తీసుకొచ్చింది వైసీపీ పాలనలోనే అని చెప్పారు. 8వ తరగతికి వచ్చిన వెంటనే పిల్లల చేతికి ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా తమదేనని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News