వెల్లువెత్తిన అభిమానం.. జగన్ ని కలిసేందుకు తరలి వస్తున్న జనం

జగన్ ని కలవాలని, సెల్ఫీ దిగాలని, ఆయన ఫొటోని ఆయనకే బహుమతిగా ఇవ్వాలని.. వికలాంగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారు ఆయన దగ్గరకు వస్తున్నారు.

Advertisement
Update:2024-03-29 09:11 IST

ముఖ్యమంత్రిగా జగన్ హాజరయ్యే సభలకు జనం హాజరయినా ఆయన్ను దగ్గరనుంచి చూసే అవకాశం మాత్రం అతి కొద్దిమందికే లభించేది. కానీ బస్సుయాత్రలో అలా కాదు.. ఆయన నిత్యం జనం మధ్య ఉంటున్నారు. ముఖాముఖి కార్యక్రమానికి జనం విపరీతంగా తరలి వస్తున్నారు. సభ దగ్గరకు వచ్చేవారు కూడా ముఖా ముఖి వేదిక వద్దకు వచ్చి అక్కడినుంచి జగన్ వాహనాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. నేడు మూడోరోజు కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి జగన్ యాత్ర ప్రారంభమవుతుంది. పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి ఆయన చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ లో బహిరంగ సభకు బయలుదేరి వెళ్తారు జగన్.



మళ్లీ ఆ రోజులు..

ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయన్ను నేరుగా కలిసేవారు ప్రజలు. తమ అభిమానాన్ని చాటుకుంటూ వివిధ రకాల జ్ఞాపికలు అందించేవారు. వాటిని జగన్ స్వీకరించినప్పుడు వారి కళ్లలో ఆనందం వర్ణనాతీతం. అయితే జగన్ సీఎం అయ్యాక, సెక్యూరిటీ కారణాల వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడు బస్సు యాత్రతో జగన్ వారి మధ్యకే వచ్చారు. ఇంకేముంది అభిమాన నాయకుడిపై తమకున్న ఆప్యాయత చాటుకునేందుకు వారు తరలి వస్తున్నారు. జగన్ ని కలవాలని, సెల్ఫీ దిగాలని, ఆయన ఫొటోని ఆయనకే బహుమతిగా ఇవ్వాలని.. వికలాంగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారు ఆయన దగ్గరకు వస్తున్నారు.

మేమంతా సిద్ధం సభల్లో సీఎం జగన్ ప్రసంగాలు వాడివేడిగా సాగుతున్నాయి. అదే సమయంలో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాటలు ప్రజలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. మళ్లీ మనమే వస్తాం, సంక్షేమ కార్యక్రమాలన్నీ మరింత బాగా కొనసాగిద్దాం అని వారికి ధైర్యం చెబుతున్నారు జగన్. ప్రస్తుత పాలనపై ఎక్కడా ప్రజలనుంచి ఫిర్యాదులు లేకపోవడం విశేషం. ఫలానా పథకం తమకు అందలేదు అని చెప్పేందుకు ఎవరూ రావట్లేదు. తాము కూడా జగనన్న పథకాల ద్వారా లబ్ధిపొందామని చెప్పేందుకే అందరూ ఉత్సాహంగా ఆయన దగ్గరకు వస్తున్నారు. మేమంతా మీతోనే ఉన్నామని ఆయనకు నైతిక మద్దతు ఇస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News